సూపర్ స్టార్ కృష్ణ తన జీవితంలో చేసిన నాలుగు తప్పులు ఇవేనా..?
TeluguStop.com
మన తెలుగు చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న ప్రేత్యేకత వేరు.
అంతేకాదు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ మాన్ గా కృష్ణ గారిని అందరూ మెచ్చుకుంటారు.
అయితే ఆయనకి నటన రాదు అని ఏడిపించేవారు కొందరు ఉన్నారు ఏమో గాని, ఆయన గట్స్ కి, మొండితనానికి, అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు లాంటి ఆయన మనస్తత్వనికి ఫిదా అవ్వని వారు మాత్రం ఎవరు ఉండరు.
ఆయన్ని అభిమానించే వారిలో చాలామంది అభిమానులు ఆయన మనస్తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.అలాంటి కృష్ణ గారు ఆయన జీవితంలో మూడు తప్పులను చేశారని సినీ వర్గాల్లో చెప్పుకుంటూ ఉంటారు.
మరి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.మొదటగా నటి కావాలి అని ఎంతో ఆశ పడిన కృష్ణ కూతురు మంజులనీ నటి కాకుండా కృష్ణ గారు అడ్డుపడ్డారు.
కృష్ణ గారి అభిమానులు మంజుల నటిగా చేస్తే ఒప్పుకోమని ఆయన మీద ఒత్తిడి తేవడం వలన మంజులని నటిగా నటించనివ్వలేదు.
అలాగే కృష్ణ గారి కొడుకులైన రమేష్ బాబుని ,మహేష్ బాబుని హీరోలుగా చేయాలనుకున్న ఆయన తన కూతురు మంజుల విషయంలో మాత్రం దైర్యంగా నిర్ణయం తీసుకోలేక పోయాడు.
షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న మంజుల తన కుటుంబ నేపథ్యం, తన తండ్రి అభిమానులు వలనే తాను అనుకున్నది చేయలేకపోయానని ఇప్పటికి బాధపడుతూ ఉంటారు .
సమాజం అంటే కేవలం వాళ్ళ నాన్నగారి అభిమానులే అనీ అనుకోవడంతో మంజుల తన గమ్యాన్ని చేరుకోలేకపోయింది అని ఇటీవల చాలా సందర్భాలలో మంజుల బాధపడ్డారు.
"""/"/
అలాగే రెండో విషయం ఏంటంటే గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో వ్యవహరించిన తీరు.
ఆయనకు వేటూరి సుందర రామ మూర్తి వలన ఎస్పీ బాలుతో వైరం ఏర్పడింది అని అంటారు.
అయితే ఈ విషయానికి సంబంధించి పెద్దగా ఎవరికీ ఏమి క్లారిటి అనేది లేదు కానీ చెప్పుడు మాటలు వినడం వల్లనే కృష్ణ ఎస్.
పీ.బాలసుబ్రహ్మణ్యం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సినీ ఇండస్ట్రీలో అనుకునేవారట .
అప్పటి కాలంలో కృష్ణ గారు ఏడాదికి 10 చిత్రాల వరకూ చేసేవాడు.అయితే అప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా సింహాసనం సినిమా తీస్తున్నారు కృష్ణ.
అయితే కృష్ణ ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తాను నటించే అన్ని చిత్రాలలోనూ రాక్ సీతారామ్ అనే కొత్త గాయకుడుకే అవకాశం ఇచ్చాడు.
కానీ కొద్దిరోజులకే కృష్ణ అభిప్రాయం మార్చుకున్నారు.తను అనుకున్న మాట మీద ఉండి నట్లయితే బావుండేది.
అలా మాట మీద ఉండకుండా కొంత కాలానికే రాక్ సీతారామ్ అనే గాయకుడుని పక్కన పెట్టి మళ్ళీ ఎస్పీ బాల సుబ్రమణ్యంను తన సినిమాలలో పాడించాడు కృష్ణ.
"""/"/
దీనితో తన కెరీర్ కూడా మలుపు తిరుగుతుందని భావించిన రాక్ సీతారామ్ ఆశలు అన్నీ ఆవిరి అయిపోయాయి.
అలాగే కృష్ణ గారు చేసిన మరో పొరపాటు ఏంటంటే దర్శకుడు రేలంగి నరసింహారావు శోభన్ బాబు తో సంసారం అనే చిత్రాన్ని తీశాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.దానితో తన బంధువైన శాఖమూరి రామచంద్ర రావు నిర్మాతగా రేలంగి నరసింహారావుతో కృష్ణ ఒక చిత్రం చేస్తానని మాట ఇచ్చారు.
దాంతో రేలంగి నరసింహారావు కృష్ణ అనుమతితో రచయత సత్యానంద్ తో కలిసి సినిమా సెట్టింగ్స్ కూడా మొదలు పెట్టాడు.
అయితే చిత్ర నిర్మాత మాత్రం ఎవరికీ చెప్పకుండా పరుచూరి బ్రదర్స్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట.
అడ్వాన్స్ ఇచ్చాక తీరిగ్గా వచ్చి ఆ విషయాన్ని రేలంగి నరసింహారావుకి చెప్పారట .
దాంతో రేలంగి నరసింహారావుకి కోపం వచ్చి తాను ఇప్పటికే రచయత అయిన సత్యానంద్ తోటి సెట్టింగ్స్ కూడా జరుగుతుందని, ఆయన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన్ని తీసివేయడం భావ్యం కాదని నిర్మాతతో చెప్పాడు.
ఇలా వారిద్దరూ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.కానీ ఆ నిర్మాత మాత్రం కృష్ణ గారితో చిత్రం చేయడం రేలంగికి ఇష్టం లేదని చెప్పాడట.
దాంతో కృష్ణ విషయం తెలుసుకోకుండా రేలంగి నరసింహారావు తోటి వివాదం పెంచుకున్నారు. """/"/
ఇది కూడా ఆయన చేసిన తప్పుల్లో ఒకటి.
అలాగే ప్రముఖ నిర్మాత రామానాయుడు, కృష్ణ, శోభన్ బాబుల తో కలిసి మల్టీస్టారర్ గా బాపయ్య దర్శకత్వంలో "ముందడుగు" సినిమా తీశారు.
ఆ తరువాత మరో సినిమా కి డేట్స్ ఇవ్వమని రామానాయుడు కృష్ణ గారిని కోరారు.
అయితే కృష్ణ గారు మాత్రం దర్శకుడిగా రాఘవేంద్రరావుగారు ఉండాలని, అలాగే రచయితలుగా పరుచూరి బ్రదర్స్ ఉండాలని కండిషన్ పెట్టారు.
దాంతో వీటన్నిటికీ రామానాయుడు ఒప్పుకొని ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్నాడు.చివరి నిమిషంలో కృష్ణ నేను మరొక నిర్మాత తో కూడా కమిట్ అయ్యాను.
మీరు భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని చేయండి అని చెప్పారు.అలా కృష్ణ గారు అన్నా మాటలు రామానాయుడికి చాలా బాధ వేసాయట.
అంతకముందు కూడా రామానాయుడు ఇలానే స్టార్స్ తో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.ఇంకా ఆ సమయంలో రామానాయుడు తన చిన్న కుమారుడు అయిన వెంకటేష్ ని హీరోగా చేసి ఆ చిత్రం స్థానంలో కలియుగ పాండవులు అనే చిత్రాన్ని నిర్మించారు.
ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇలా కృష్ణ గారి జీవితంలో జరిగిన ఈ నాలుగు తప్పులు మాత్రం ఎప్పటికీ చెరగని ముద్ర లాగా అలాగే మిగిలి పోయాయి.
నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?