అభిమాని దర్శకత్వంలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ.. రిజల్ట్ ఏమిటంటే?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శక నిర్మాతలుగా రాణిస్తున్న కొంతమంది ఒకప్పుడు అగ్ర దర్శకుల వద్ద పని చేశారు.

అలా ఒకప్పుడు అగ్ర దర్శకుల వద్ద అసోసియేట్ గా పని చేస్తూనే ఆ తరువాత ఆ దర్శకుడిగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు.

అలాంటి వారిలో ముప్పలనేని శివ కూడా ఒకరు.ముప్పలనేని శివ దర్శకుడు కాకముందు ఆ నాటి అగ్ర దర్శకులు అయిన ఏ కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య అలాంటి పెద్ద పెద్ద దర్శకుల దగ్గర అసోసియేట్ గా పని చేశారు.

శివ ఎక్కువగా కోదండరామిరెడ్డి దగ్గర పని చేశారు.దాదాపుగా 20 సినిమాల వరకు పని చేశారు.

ఆ సమయంలో శివ కీ ఆ నాటి టాప్ హీరోలు అయినా అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,చిరంజీవి, కమలహాసన్ లాంటి వారితో పనిచేసే అవకాశం లభించింది.

శివ కు వ్యక్తిగతంగా హీరో కృష్ణ అంటే చాలా ఇష్టం.అయినా కృష్ణ హీరోగా నటించిన ఘరానా అల్లుడు సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

తన అభిమాన హీరో తోనే మొదటి సినిమా తీయడం, ఆ సినిమాకు అతనే దర్శకత్వం వహించడం విశేషం.

హీరో కృష్ణ సినిమా లో ఇటువంటి అంశాలు ఉంటే అభిమానులకు నచ్చుతాయి అన్న విషయం శివకు బాగా తెలుసు.

అది దృష్టిలో పెట్టుకుని శివ కథను తయారు చేసి, తన అభిమాన హీరో అయినా కృష్ణకు వినిపించారు.

"""/" / హీరో కృష్ణ కు కథ నచ్చడంతో ఓకే అనగా 1993 నవంబర్ 10 న ఘరానా అల్లుడు సినిమా షూటింగ్ మొదలైంది.

ఈ సినిమా టీచింగ్ డ్రామాతో రూపుదిద్దుకుంది.ఇందులో హీరో కృష్ణ సరసన మాలాశ్రీ హీరోయిన్ గా మొదటి సారిగా నటించింది.

అదేవిధంగా హీరో కృష్ణ సినిమాకి సంగీత దర్శకుడిగా కీరవాణి పనిచేయడం కూడా అదే మొదటిసారి.

"""/" / ఈ సినిమాలో హీరోయిన్ కి తండ్రిగా, హీరో క్రిష్ణ కీ మామగా కోట శ్రీనివాసరావు నటించాడు.

అదే విధంగా నటి సంగీత హీరో కృష్ణకు తల్లిగా నటించింది.సంగీత భలే కృష్ణుడు, జతగాడు సినిమాలలో కృష్ణ సరసన నటించింది.

ఈ సినిమా విడుదల అయ్యే సూపర్ హిట్ గా నిలవడంతో పాటు కృష్ణ ఖాతాలో మరో విజయాన్ని జత చేసింది.

రోజా పొలిటికల్ సైలెన్స్ అందుకేనా ?