మహేష్ ఫ్యామిలీ హీరో నెం.2 తోనైనా సక్సెస్ ను దక్కించుకుంటాడా!
TeluguStop.com
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి పలువురు హీరో లు ఇప్పటికే ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు మేనల్లుడు అయిన అశోక్ గల్లా హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.
హీరో చిత్రం తో అతడు గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
కానీ మొదటి సినిమా తో అశోక్ గల్లా సక్సెస్ దక్కించుకోలేక పోయాడు.దాంతో రెండవ సినిమా కి కాస్త సమయం తీసుకున్నాడు.
"""/"/
ఎట్టకేలకు అశోక్ గల్లా రెండవ సినిమా ప్రారంభమైంది.అర్జున్ జంధ్యాల దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా కు ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ అందిస్తున్నాడు.
అశోక్ గల్లా బాడీ లాంగ్వేజ్ కి మరియు స్టార్డం కి సరిగ్గా సెట్ అయ్యే విధంగా ఈ సినిమా కథ ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయింది. """/"/
పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇదే సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మొదటి సినిమా తో ఎలాగూ సక్సెస్ సొంతం చేసుకోలేక పోయిన అశోక్ గల్లా కనీసం ఈ రెండో సినిమా తో అయినా సక్సెస్ ని తన ఖాతా లో వేసుకుని మొదటి సక్సెస్ ని ఆస్వాదిస్తాడేమో చూడాలి.
మొదటి సినిమా కోసం మహేష్ బాబు తో సాధ్యమైనంత వరకు ప్రమోషన్ చేయించారు.
సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆ సమయం లో మనవడు గల్లా అశోక్ కోసం మీడియా ముందుకు వచ్చాడు.
రమేష్ బాబు మృతి చెందిన సమయంలో విడుదలైన అశోక్ మొదటి సినిమా నిరాశ పరిచింది.
అయినా కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మహేష్ బాబు అభిమానులు ఆయనకు తోడుగా ఉంటారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
కాస్త మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా అశోక్ గల్లా హీరోల జాబితాలో చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడం ఎలానో తెలుసా?