చుండ్రును ఇట్టే పోగొట్టే టీ డికాషన్.. ఎలాగో తెలుసా?

చుండ్రు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

అందులోనూ చ‌లి కాలంలో చుండ్రు స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటుంది.వేడి వేడి నీటితో త‌ల స్నానం చేయ‌డం, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, దుమ్ము, ధూళి, కొన్ని రకాల మందులను వాడటం, ఆహార‌పు అల‌వాట్లు, జుట్టు సంర‌క్ష‌ణ లేక పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ఇదేమి అనారోగ్య సమస్య కాక‌పోయిన‌ప్ప‌టికీ.చిరాకు పెట్టించే స‌మ‌స్య‌.

అందుకే చుండ్రును వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన షాంపూలు, నూనెలు వాడ‌తారు.

వారు, వీరు చెప్పిన హెయిర్ ప్యాక్స్‌ను వినియోగిస్తుంటారు.అయినా ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక మాన‌సిక ఆందోళ‌న‌కు గ‌ర‌వుతుంటారు.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే టీ డికాష‌న్‌తో చుండ్రును ఇట్టే వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం టీ డికాష‌న్‌ను జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాట‌ర్ పోసి హీట్ చేయాలి.

నీరు కాస్త వేడి అయిన త‌ర్వాత అందులో రెండు స్పూన్ల టీ పొడి వేసి బాగా మ‌రిగించి ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ టీ డికాష‌న్‌ను పూర్తిగా చ‌ల్ల‌ బెట్టేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో త‌యారు చేసుకున్న టీ డికాష‌న్‌, రెండు స్పూన్ల నిమ్మ ర‌సం, నాలుగు స్పూన్లు రెగ్యుల‌ర్ షాంపూ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌యాన్ని యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక చుండ్రు స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.

అంతే కాదు, పైన చెప్పిన విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే తెల్ల జుట్టు త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.

మ‌రియు కురులు బ‌లంగా కూడా పెరుగుతాయి.