ఎన్ని చేసినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

హెయిర్ ఫాల్ ( Hair Fall )అనేది అందరిలోనూ కామన్ గా ఉండే సమస్య.

కానీ కొందరిలో మాత్రం ఇది చాలా తీవ్రంగా ఉంటుంది.దీంతో హెయిర్ ఫాల్ సమస్యను నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇరుగుపొరుగు వారు చెప్పిన చిట్కాలు అన్నీ ప్రయత్నిస్తుంటారు.కానీ, ఎన్ని చేసినా జుట్టు రాలడం ఆగట్లేదా.

? అయితే మీరు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కరివేపాకు,( Curry Leaves ) ఒక కప్పు మెంతాకు వేసుకోవాలి.

అలాగే సరిపడా వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మెంతాకు పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి( Amaranth Powder ), వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి కేవలం ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా త‌గ్గు ముఖం పడుతుంది.

కరివేపాకు, మెంతాకు, ఉసిరికాయ పొడి మరియు పెరుగులో( Curd ) ఉండే పలు సుగుణాలు జట్టు కుదుళ్లకు చక్కని పోషణ అందిస్తాయి.

కురులను బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్ సమస్య( Hair Fall Problem )కు అడ్డుకట్ట వేస్తాయి.

కాబట్టి జుట్టు అధికంగా రాలుతుందని బాధపడుతున్న వారు, బెంగ పెట్టుకున్నారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

బెస్ట్ రిజ‌ల్ట్ మీ సొంతం అవుతుంది.అంతేకాదు ఈ రెమెడీ వల్ల మీ జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.

ఒత్తుగా సైతం పెరుగుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్8, మంగళవారం 2024