హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారా? అయితే దీన్ని ట్రై చేయండి!
TeluguStop.com
వర్షాకాలంలో హెయిర్ ఫాల్ డబుల్ అవుతుంటుంది.దాంతో ఈ సమస్యను ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో తెలియక వర్రీ అయిపోతుంటారు.
మీరు కూడా హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారా.? అయితే చింతించకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ హెయిర్ ప్యాక్‌ను ట్రై చేస్తే.
హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా చిన్న కీర దోసకాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, కట్ చేసి పెట్టుకున్న కీర స్లైసెస్, మూడు రెబ్బల కరివేపాకు, ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి నాలుగు లేదా ఐదు గంటల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు, కలోంజి సీడ్స్, కరివేపాకు మరియు కీర దోసకాయ ముక్కలను వాటర్‌తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/"/ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.
షవర్ క్యాప్ ను ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో కురులను శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే.జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది.కాబట్టి, హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అయ్యే వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి.
టెస్లాలో జాబ్ సంపాదించడానికి 10 ఇంటర్వ్యూలు ఫేస్ చేసిన ఎన్నారై..?