పాపం కళ్యాణ్ దేవ్‌.. ఇలా అవుతుందని ఊహించే ఉండడు

కళ్యాణ్ దేవ్ హీరోగా సూపర్ మచ్చి అనే సినిమా ప్రారంభ సమయంలో భారీగా అంచనాలను కలిగి ఉంది.

ఆ సమయం లో మెగా అభిమానుల దృష్టి మాత్రమే కాకుండా అందరి దృష్టిని సూపర్ మచ్చి ఆకర్షించ గలిగింది.

కళ్యాణ్ దేవ్‌ కి కచ్చితంగా సూపర్ మచ్చి చిత్రం మంచి విజయాన్ని తెచ్చి పెడుతుంది అంటూ ప్రతి ఒక్కరూ నమ్మకం వ్యక్తం చేశారు.

కరోనా వల్ల సినిమా కాస్త ఆలస్యమైంది.సినిమా విడుదలయ్యే సమయానికి మెగా స్టార్ అల్లుడు కాస్త మాజీ అల్లుడిగా కళ్యాణ్ దేవ్ మారిపోయాడు.

దాంతో సూపర్ మచ్చి సినిమా ను జనాలు పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

దాంతో సినిమా దారుణమైన పరాజయం పాలయ్యింది అంటూ టాక్ ను దక్కించుకుంది.ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సూపర్ మంచి సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశారు.

ప్రస్తుతం అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను జనాలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

మొన్నటి వరకు మెగాస్టార్ అల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ ఇప్పుడు మెగాస్టార్ కి మాజీ అల్లుడు కనుక సూపర్ మచ్చి సినిమా ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ అంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

మెగా స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని లైట్ తీసుకుంటున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

"""/"/ మెగా అభిమానులు మాత్రమే కాకుండా ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమా పెద్దగా పట్టించుకోకపోవడం కి కారణం ఇప్పటికే విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది అంటున్నారు.

అయితే ఈ సినిమా అమెజాన్ ద్వారా విడుదలైన ఆధరణ దక్కించుకోవడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంటే.

అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా అమెజాన్ ద్వారా మంచి రెస్పాన్స్ వస్తోందట.

చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని తెలియ జేస్తున్నారు.అమెజాన్ వారు కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంది అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

సీనియర్ హీరోయిన్లను ఫాలో అవుతున్న శ్రీ లీల.. పెద్ద ప్లానింగే