గ్లోయింగ్ స్కిన్ కోసం సూప‌ర్ జ్యూస్‌..రోజూ తాగితే మ‌స్తు బెనిఫిట్స్‌!

ఎల్ల‌ప్పుడూ స్కిన్ గ్లోయింగ్‌గా మెరిసిపోవాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోస‌మే ఖ‌రీదైన క్రీమ్స్‌, లోష‌న్స్‌, మాయిశ్చ‌రైజ‌ర్స్‌, సీర‌మ్స్‌ను కొనుగోలు చేసి యూజ్ చేస్తుంటారు.

వారంలో రెండు లేదా మూడు సార్లు ఫేస్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.అలాగే త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి ఫేషియ‌ల్స్ చేయించు కుంటారు.

అయితే చ‌ర్మం గ్లోయింగ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే పైపై పూత‌లు స‌రిపోవు.డైట్‌లో కొన్ని ఆహారాల‌ను కూడా చేర్చుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను రోజూ తాగితే బోలెడ‌న్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? ఎలా త‌యారు చేసుకోవాలి.

? వంటి విష‌యాల‌పై లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక‌ ట‌మోటో, ఒక కీర‌, ఒక క్యారెట్ తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొల‌గించి గింజ‌ల‌ను వేరు చేసుకోవాలి.

మ‌రియు ఒక ఆరెంజ్‌ను తీసుకుని పీల్ తీసేసి స్లైసెస్‌గా క‌ట్ చేయాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసుకున్న ట‌మాటో, క్యారెట్‌, కీర ముక్క‌లు, దానిమ్మ పండు గింజ‌లు, """/" / ఆరెంజ్ స్లైసెస్, హాఫ్ లీట‌ర్ వాట‌ర్ వేసుకుని గ్రౌండ్ చేసుకుంటే జ్యూస్ సిద్ధం అవుతుంది.

ఈ జ్యూస్‌ను గ్లాస్‌లోకి స‌ర్వ్ చేసుకుని.రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ ర‌సం యాడ్ చేసుకుని సేవించాలి.

ఈ జ్యూస్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగారింపుగా, య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

చ‌ర్మంపై మొటిమ‌లు రాకుండా ఉంటాయి.వృద్ధాప్య ల‌క్ష‌ణాల‌కు దూరంగా ఉండొచ్చు.

మ‌రియు స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మారుతుంది.పైగా ఈ సూప‌ర్ జ్యూస్‌ను తాగితే ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలెన్నో శ‌రీరానికి ల‌భిస్తాయి.

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా పైన చెప్పిన జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోండి.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!