బలహీనమైన జుట్టును బలంగా మార్చే హోమ్ రెమెడీ మీకోసం!
TeluguStop.com
జుట్టు కుదుళ్లు బలహీనంగా మారే కొద్ది హెయిర్ ఫాల్ సమస్య అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది.
అందుకే బలహీనమైన జుట్టును బలంగా మార్చుకోవడం ఎంతో అవసరం.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.
మరి ఆ హోమ్ రెమెడీ ఏంటీ దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.
కడిగిన ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి.
ఈ ఉల్లిపాయ పేస్ట్ నుండి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయ జ్యూస్, ఒక గుడ్డు పచ్చ సొన, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల పాలు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
రెండు లేదా మూడు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఐదు రోజులకు ఒక సారి ఇలా చేస్తే గనుక బలహీనమైన జుట్టు బలంగా మారుతుంది.
దాంతో హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా దూరం అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం ప్రారంభం అవుతుంది.
అంతే కాదండోయ్.ఎవరైతే చుండ్రు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారికి పైన చెప్పిన రెమెడీ చాలా మేలు చేస్తుంది.
ఉల్లి, ఆలోవెర మరియు ఆముదంలో ఉండే ప్రత్యేక సుగుణాలు చుండ్రు సమస్యను సులభంగా నివాస్తాయి.
కాబట్టి, చుండ్రు ఉన్న వారు కూడా ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి.
వర్సిటీ క్యాంపస్‌లో లోదుస్తులతో విద్యార్థిని నిరసన.. మ్యాటరేంటంటే?