రక్తపోటు తగ్గించే సూపర్ ఆహారాలు
TeluguStop.com
మారుతున్న జీవనశైలి, ఉప్పు, కారాలు ఎక్కువగా తినటం, మసాలా పదార్ధాలు ఎక్కువగా తినటం, మానసిక ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో రక్తపోటు వస్తుంది.
అయితే కొన్ని ఆహారాలను తీసుకుంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.
డార్క్ చాకోలెట్ లో పాలీ ఫినాల్స్, ఫ్లెవనాయిడ్స్, క్యాథెచిన్స్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన రక్త సరఫరాను మెరుగుపరచి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటును తగ్గించటమే కాకుండా రక్త సరఫరాకు ఎటువంటి అంటంకాలు లేకుండా చేయటంలో సహాయపడుతుంది.
రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని త్రాగితే శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది.
శరీరం హైడ్రేడ్ గా ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. """/"/ అందువల్ల తప్పనిసరిగా నీటిని త్రాగాలి.
బీట్ రూట్, ముల్లంగిలలో రక్త సరఫరా మెరుగుపరిచే లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన వారంలో మూడు సార్లు ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ఇవి బీపీని తగ్గిస్తాయి.
రక్త నాళాల్లో కొవ్వు చేరకుండా చూస్తాయి.రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి.
వెల్లుల్లి కూడా రక్తపోటును తగ్గించటానికి చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది.ప్రతి రోజు మూడు లేదా నాలుగు రెబ్బలను తింటూ ఉంటె క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది.
అలాగే చేదు కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
తాళికట్టిన భర్తను నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చంపిన భార్య?