ఎక్కిళ్ళను చిటికెలో త‌గ్గించే సూప‌ర్ ఎఫెక్టివ్ టిప్స్ ఇవే!

ఎక్కిళ్ళు.దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో వీటిని ఫేస్ చేసే ఉంటారు.

కొంద‌రిని ఎక్కిళ్ళు అప్పుడ‌ప్పుడు ఇబ్బంది పెడితే.కొంద‌రిని మాత్రం త‌ర‌చూ వేధిస్తూనే ఉంటాయి.

ఇది చాలా చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.తీవ్ర‌మైన అసౌక‌ర్యానికి గురి చేస్తుంది.

పైగా ఎక్కిళ్ళు వ‌స్తున్నంత‌సేపు స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతుంటారు.చేస్తున్న ప‌నిపై ఏకాగ్ర‌త చూప‌లేక‌పోతుంటారు.

అలాంటి స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క‌, ఎక్కిళ్ళ‌ను ఎలా త‌గ్గించుకోవాలో అర్థంగాక ఆగ‌మాగం అయిపోతుంటారు.

అయితే అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే చిటికెలో ఎక్కిళ్ళ‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఎక్కిళ్ళ‌ను త‌గ్గించే ఈ టిన్స్‌ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ఎక్కిళ్ళ‌ను నిమ్మ‌కాయ క్ష‌ణాల్లో త‌గ్గించగ‌ల‌దు.ఎక్కిళ్ళు వ‌స్తున్న‌ప్పుడు వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సాన్ని డైరెక్ట్‌గానే తీసుకుంటే అవి చాలా త్వ‌ర‌గా ఆగిపోతాయి.

నిమ్మ ర‌సానికి బ‌దులు ఆపిల్ సైడర్ వెనిగర్ ను కూడా వినియోగించ‌వ‌చ్చు.ఎక్కిళ్ళ‌ను వేగంగా త‌గ్గించే సామ‌ర్థ్యం దానికి కూడా ఉంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ను మూడు, నాలుగు చుక్క‌ల చ‌ప్పున నోట్లో వేసుకుంటే ఎక్కిళ్ళ నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

"""/"/ ఆగ‌కుండా ఎక్కిళ్ళు వ‌స్తున్న‌ప్పుడు.గ‌ట్టిగా ఊపిరిని పీల్చి కొన్ని సెకెండ్ల పాటు బిగబ‌ట్టాలి.

ఇలా చేసినా ఎక్కిళ్ళు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్‌ను తీసుకుని ఏదైనా ప‌ల్చ‌టి వ‌స్త్రంలో చుట్టి.

మెడ‌పై పెట్టుకోవాలి.ఎక్కిళ్ళు వ‌స్తున్న‌ప్పుడు ఈ విధంగా చేస్తే వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

కోక పౌడ‌ర్‌తోనూ ఎక్కిళ్ళ‌ను వ‌దిలించుకోవ‌చ్చు.ఆగ‌కుండా ఎక్కిళ్ళు వ‌స్తున్న‌ప్పుడు కోక పౌడ‌ర్‌ను కొద్దిగా నోట్లో వేసుకుని తినాలి.

ఇలా చేస్తే శ్వాస నాళానికి విశ్రాంతి ల‌భిస్తుంది.ఫ‌లితంగా ఎక్కిళ్ళు దూరం అవుతాయి.

ఇక ఎక్కిళ్ళు బాగా వ‌స్తున్న స‌మ‌యంలో కొద్దిగా అల్లం ర‌సం తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

Gulab Jamun Noodles : ఇదెక్కడి విచిత్రమైన ఫుడ్ కాంబో.. నూడుల్స్‌లో గులాబ్ జామున్‌..!