పైసా ఖ‌ర్చు లేకుండా ముఖాన్ని తెల్ల‌గా మార్చే సూప‌ర్ రెమెడీ ఇదే!

వేస‌వి కాలం మొద‌లైంది.ఎండ‌లు రోజురోజుకు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

ఈ సీజ‌న్‌లో మండే ఎండ‌ల కార‌ణంగా తెల్ల‌గా మెర‌వాల్సిన చ‌ర్మం.న‌ల్ల‌గా, కాంతిహీనంగా మారిపోతుంటుంది.

దాంతో మ‌ళ్లీ చ‌ర్మాన్ని వైట్‌గా మార్చుకునేందుకు ఎన్నెన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.ర‌క‌ర‌కాల క్రీములు వాడుతారు.

ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే గ‌నుక పైసా ఖ‌ర్చు లేకుండా ముఖాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని క‌ప్పు వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల క‌డిగిన బియ్యం వేసి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో ఉడికించిన రైస్‌ను గ్రైండ్ చేసుకుని.స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుంటే రైస్ క్రీమ్ సిద్ధ‌మ‌వుతుంది.

"""/"/ ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌, క‌ప్పు పాలు వేసుకుని ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

ఇప్పుడు దీనిని స్ట‌వ్‌పై పెట్టి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.బాగా కూల్ అయిన వెంట‌నే ఈ మిశ్ర‌మంలో మొద‌ట త‌యారు చేసుకున్న రైస్ క్రీమ్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడ‌కు మ‌రియు చేతుల‌కు అప్లై చేసి.

ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.అనంత‌రం నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారంలో మూడు సార్లు చేస్తే గ‌నుక‌.న‌ల్ల‌బ‌డిన చర్మం స‌హ‌జంగానే తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.