పది రోజుల్లో స్కిన్ టోన్‌ను పెంచే ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ ఇదే!
TeluguStop.com
స్కిన్ టోన్‌ను పెంచుకోవాలనే కోరిక కోట్లాది మందికి ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలు స్కిన్ టోన్ ను పెంచుకోవడం కోసం చర్మంపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్, జెల్స్ వాడుతుంటారు.తరచూ బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు.
అలాగే కొందరు ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, న్యాచురల్‌గా కూడా స్కిన్ టోన్‌ను పెంచుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్‌ను ట్రై చేస్తే కేవలం పది రోజుల్లోనే మీ స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫేస్ ప్యాక్ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా హాఫ్ యాపిల్‌ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు ఉసిరి కాయలను తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మరోవైపు చిన్న క్యారెట్‌ను తీసుకుని సన్నగా తురిమి జ్యూస్‌ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, ఉసిరి కాయ ముక్కలు, వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో యాపిల్, ఉసిరి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ శెనగపిండి, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
"""/"/
ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేస్తే పది రోజుల్లోనే స్కిన్ టోన్ పెరగడం స్టార్ట్ అవుతుంది.
అలాగే చర్మంపై ఏమైనా ముదురు రంగు మచ్చలు ఉన్నా క్రమంగా తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!