మీ కేశాల‌ను సిల్కీగా, షైనీగా మార్చే సూప‌ర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

త‌మ కేశాలు సిల్కీగా, షైనీగా మెర‌వాల‌ని చాలా మంది తెగ ఆరాట‌ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల జెల్స్‌, క్రీమ్స్, సీర‌మ్స్‌ వంటివి వాడుతుంటారు.

అయితే ఆ ఉత్ప‌త్తులు జుట్టుకు లాభం కంటే ఎక్కువ న‌ష్టాన్నే క‌లిగిస్తాయి.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ న్యాచుర‌ల్ రెమెడీని ప్ర‌య‌త్నిస్తే.

మీ కేశాలు సిల్కీగా, షైనీగా మార‌తాయి.అదే స‌మ‌యంలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ను మీకు క‌లిగించ‌కుండా కూడా ఉంటుంది.

మ‌రి ఆల‌స్యం చేయ‌డ‌మెందుకు ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముంద‌గా రెండు టేబుల్ స్పూన్ల మెంతుల‌ను మిక్సీ జార్‌లో వేసి.మెత్త‌టి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాట‌ర్‌ను పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌క‌ముందే మెంతుల పొడిని వేసి.ఉండ‌లు లేకుండా క‌ల‌పాలి.

ఆ త‌ర్వాత స్లో ఫ్లేమ్‌పై స్పూన్‌తో తిప్పుకుంటూ దాదాపు ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

"""/"/ ఇప్పుడు ఉడికించుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక‌.

అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కోక‌న‌ట్ ఆయిల్‌, మూడు టేబుల్ స్పూన్ల ఫ్లెక్స్ సీడ్స్ జెల్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఆపై త‌యారు చేసుకున్న ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.

ష‌వ‌ర్ క్యాప్ ను ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మీ కేశాలు సిల్కీగా, షైనీగా మెరుస్తాయి.

అదే స‌మ‌యంలో మీ కురులు దృఢంగా, ద‌ట్టంగా కూడా పెరుగుతాయి.

చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు, విశేషాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?