మొండి మచ్చలు ఎంతకు తగ్గట్లేదా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

ఎలాంటి మచ్చలు లేకుండా ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవాలని దాదాపు అందరూ కోరుకుంటారు.

కానీ మొటిమలు, వయసు పైబ‌డటం, పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడుతుంటాయి.

అవి సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.పైగా ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఆ మచ్చలు పోనే పోవు.

ఇటువంటి మొండి మచ్చలతో మీరు కూడా విసిగిపోయారా? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మొండి మచ్చలు అయినా దెబ్బకు పరార్ అవుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కీర దోసకాయ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తరుముకోవాలి.

ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చ సొన వేసుకోవాలి.

"""/" / అలాగే మూడు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ జ్యూస్ ( Cucumber )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేసుకుని.

ఇర‌వై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి మొండి మచ్చలు అయినా సరే కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.

"""/" / క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటిస్తే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

ముడతలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

యవ్వనంగా మెరుస్తుంది.పిగ్మెంటేషన్ సమస్య( Pigmentation Problem )ను నివారించడానికి కూడా ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోండి.