తెల్ల జుట్టుతో వర్రీ వద్దు.. ఈ రెమెడీతో సమస్యను సులభంగా వదిలించుకోండి!
TeluguStop.com
తెల్ల జుట్టు.ఇటీవల రోజుల్లో వయసు పైబడిన వారే కాదు యంగ్ ఏజ్ వారు సైతం ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
స్ట్రెస్, పోషకాల కొరత, ధూమపానం, మద్యపానం, థైరాయిడ్, కాలుష్యం, రెగ్యులర్‌గా షాంపూ చేసుకోవడం వంటి రకరకాల కారణాల వల్ల తక్కువ వయసులోనే నల్ల జుట్టు తెల్లగా మారుతుంటుంది.
దాంతో వైట్ హెయిర్ ను కవర్ చేసుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.
అయితే ఇకపై తెల్ల జుట్టుతో వర్రీ వద్దు.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే వైట్ హెయిర్ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు.
మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి.స్ట్రైనర్ సాయంతో వాటర్‌ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పొడి, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి వేసుకుని కలుపుకోవాలి.
"""/" /
అలాగే చివరిగా అందులో లవంగాల నీటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.
వారంలో ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.
పైగా ఈ రెమెడీ వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.
మణిరత్నం చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్న నందమూరి బ్రహ్మిని…