మొండి మొటిమలైన మచ్చలైన ఈ రెమెడీని పాటిస్తే దెబ్బకు పరార్ అవుతాయి!
TeluguStop.com
మొటిమలు, మచ్చలు.( Acne ) అత్యంత సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యలు.
( Skin Problems ) చంద్రబింబం లాంటి ముఖాన్ని మొటిమలు, మచ్చలు దారుణంగా పాడు చేస్తాయి.
మనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి.ఈ క్రమంలోనే మొటిమలు, మచ్చలను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఒక్కసారి ఎంత ప్రయత్నించినా అవి వదిలి పెట్టవు.ఇటువంటి మొండి మొటిమలు, మచ్చలను నివారించడానికి ఒక పవర్ ఫుల్ రెమెడీ ఉంది.
ఈ రెమెడీని పాటిస్తే ఎంతటి మొండి మచ్చలైన, మొటిమలైన దెబ్బకు పరార్ అయిపోతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green Tea Powder ) వేసి బాగా మరిగించాలి.
ఇలా మరిగించిన గ్రీన్ టీ ని ఫిల్టర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ సి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
"""/" /
చివరగా తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ టీ ని సరిపడా వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్ సహాయంతో కాస్త మందంగా అప్లై చేయాలి.
20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఎలాంటి మొండి మొటిమలు, మచ్చలు దెబ్బకు మాయం అవుతాయి.
మొటిమలను మచ్చలను చాలా వేగంగా నివారించడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ రెమెడీని పాటిస్తే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా నిగారింపుగా మెరుస్తుంది.
CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?