జుట్టు ఎంత పలుచగా ఉన్నా ఇలా చేస్తే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్ ( Hair Growth )అనేది లేకపోవడం వల్ల ఊడే జుట్టు ఊడుతుంది కానీ మళ్ళీ కొత్త జుట్టు రాదు.

దీని కారణంగా కొద్ది రోజుల్లోనే జుట్టు పలుచగా మారిపోతుంటుంది.దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.

ఎలా మ‌ళ్లీ జుట్టును ఒత్తుగా మార్చుకోవాలో అర్థం గాక మదన పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత పలుచగా ఉన్నా సరే నెల రోజుల్లోనే ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు పెసలు, ఒక కప్పు మెంతులు ( Fenugreek ), ఐదు బాదం పప్పులు వేసి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఆ తరువాత అదే కడాయిలో రెండు కప్పులు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న కరివేపాకు, మెంతులు, పెసలు, బాదం వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, సరిపడా కొబ్బరి పాలు( Coconut Milk ) వేసుకుని లూజ్ స్ట్రక్చర్ లో మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు కుదుళ్లకు చక్కటి పోషణ అందుతుంది.

హెయిర్ గ్రోత్ ట్రిపుల్ అవుతుంది.కొద్ది రోజుల్లోనే పలుచగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా మారడం ప్రారంభమవుతుంది.

కాబట్టి పలుచటి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

అక్కా చెల్లెళ్ల మధ్య గ్యాప్.. శిల్పా శిరోద్కర్ పోస్ట్ తో పూర్తి క్లారిటీ వచ్చేసిందిగా!