వారానికి ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు ఊడమన్నఊడదు!

హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారా.? జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఎన్ని ప్రయోగాలు, ప్ర‌య‌త్నాలు చేసిన ఫలితం ఉండటం లేదా.

? హెయిర్ ఫాల్ తో బాగా విసిగిపోయారా.? అయితే ఇకపై వర్రీ వద్దు.

జుట్టు రాలడానికి కారణాలు అనేకం.పోషకాల కొరత, నిద్రలేమి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.

కారణం ఏదైనా సరే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్టేందుకు ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఊడమన్నఊడదు.జుట్టు రాలడాన్ని నివారించడానికి ఈ రెమెడీ అంత ఎఫెక్టివ్ గా పని చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), వన్ టేబుల్ స్పూన్ శీకాకై పౌడర్( Shikakai Powder ), రెండు రెబ్బలు కరివేపాకు ( Curry Leaves )వేసి కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరు వెచ్చగా అయిన తర్వాత మీ రెగ్యులర్ షాంపూను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ వాటర్ ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలమన్న రాలదు.

"""/" / హెయిర్ ఫాల్ సమస్యను నివారించ‌డానికి ఈ రెమెడీ బాగా హెల్ప్ చేస్తుంది.

సూపర్ ఫాస్ట్ గా హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.

జుట్టు సిల్కీగా మెరుస్తుంది.మరియు చుండ్రు సమస్య దూరం అవుతుంది.

స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా సైతం మారుతుంది.

రాధాకృష్ణా.. బహిరంగ చర్చకు నేను రెడీ