పిల్లల్లో జలుబును తరిమికొట్టే సూపర్ ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు ఇవే!

ప్రస్తుత చలికాలంలో వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందర్నీ అత్యధికంగా ఇబ్బంది పెట్టే సమస్యలో జలుబు( Cold ) ముందు వరుసలో ఉంటుంది.

అయితే జలుబు చేసినప్పుడు పెద్దలు దాన్ని తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

కానీ పిల్లలకు అవేమీ తెలియదు.ఈ క్రమంలోనే జలుబు కారణంగా పిల్లలు తీవ్ర‌మైన ఇబ్బందికి గురవుతుంటారు.

ఒక్కసారి జలుబు వల్ల ఊపిరి ఆడక రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర కూడా పోరు.

అందుకే పిల్లల్లో జలుబు ని తరిమి కొట్టడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

"""/" / జలుబును త్వరగా తగ్గించడానికి నిమ్మపండు( Lemon ) అద్భుతంగా సహాయపడుతుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్లు నిమ్మరసం, వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )కలిపి పిల్లల చేత ఉదయాన్నే తాగించాలి.

తద్వారా ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ గా మారుతుంది.ఫ‌లితంగా జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులు పరార్ అవుతాయి.

పిల్లలకి జలుబు చేసినప్పుడు వారిచేత‌ వాటర్ ను ఎక్కువగా తాగించాలి.అది కూడా గోరు వెచ్చని నీటినే ప్రిఫర్ చేయాలి.

అలాగే అరకప్పు ఆవ నూనెలో( Mustard Oil ) ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి వడగట్టాలి.

గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి నూనెను పిల్లల ఛాతి, వీపు, మెడ పైన రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.

ఇలా చేయడం వల్ల జలుబు సమయంలో చాలా రిలీఫ్ గా ఉంటుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.

"""/" / నైట్ నిద్రించే ముందు ఆవు పాలలో చిటికెడు పసుపు( Turmaric ), చిటికెడు మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసి మరిగించి.

ఆ పాలను పిల్లల చేత తాగించాలి.ఈ డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలను చాలా త్వరగా నివారిస్తుంది.

జ‌లుబుతో బాధ‌ప‌డే పిల్ల‌ల‌కు ఇది బ్రెస్ట్ డ్రింక్ గా చెప్పుకోవ‌చ్చు.ఇక రోజుకు ఒకసారి అయినా పిల్ల‌ల చేత ఆవిరి పట్టించాలి.

ఇలా చేయడం వల్ల ఊపిరి బాగా ఆడుతుంది.జ‌లుబు సైతం త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం. మేకను రేప్ చేసిన కామాంధుడు.. వీడియో వైరల్..