సమ్మర్లో ఈ డ్రింక్ తాగితే నీరసం అన్న మాటే అనరు!
TeluguStop.com
సమ్మర్ సీజన్ రానే వచ్చింది.రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి.
ఈ వేసవి కాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో నీరసం ఒకటి.అధిక ఎండలు, ఉక్కపోత వంటి కారణాల వల్ల తరచూ నీరసం బారిన పడుతుంటారు.
దాంతో ఏ పని చేయలేక ఎప్పుడూ రెస్ట్ మోడ్‌లోనే ఉంటుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎనర్జిటిక్ డ్రింక్‌ను తీసుకుంటే వేసవిలో నీరసం అన్న మాటే అనరు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని.
అందులో ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు పిస్తా పప్పు, ఒక కప్పు జీడిపప్పు, పది మిరియాలు, ఐదు యాలకులు వేసి ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు, రెండు టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు, వన్ టేబుల్ స్పూన్ సోంపు, మూడు టేబుల్ స్పూన్ల గులాబీ రేకలు(ఎండినవి), హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మళ్లీ ఐదారు నిమిషాల పాటు వేయించుకుని చల్లార బెట్టుకోవాలి.
ఇప్పుడు వేయించుకున్న పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు.
దీనిని ఎలా యూస్ చేయాలంటే.ఒక గ్లాస్ కాచిన పాలలో తయారు చేసుకున్న పొడి రెండు టేబుల్ స్పూన్లు, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి కలిసి సేవించాలి.
"""/" /
సమ్మర్లో ఈ సూపర్ టేస్టీ డ్రింక్‌ను రోజుకు ఒక సారి తీసుకుంటే నీరసం సమస్యే ఉండదు.
పైగా రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండేందుకు కావాల్సినంత శక్తి శరీరానికి లభిస్తుంది.అలాగే చాలా మంది రక్తహీనతతో బాధ పడుతుంటారు.
అలాంటి వారు ఈ డ్రింక్‌ను తాగితే.శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది.
ఫలితంగా రక్త హీనత దూరం అవుతుంది.
ద్యావుడా.. చైనా మహిళలు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే..