నరాల బలహీనత వేధిస్తుందా? అయితే మీరీ డ్రింక్ తాగాల్సిందే!
TeluguStop.com
నరాల బలహీనత.ఎందరినో వేధించే సమస్య ఇది.
నాడీ వ్యవస్థ మొత్తం శరీరంలో వ్యాపించి ఉన్నందున.నరాల బలహీనత శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
అందుకే నరాల బలహీనత ఉన్న వారు ఎప్పుడూ నీరసంగా, అలసటగా కనిపిస్తారు.ఏ పని చేయలేకపోతుంటారు.
తరచూ తిమ్మిర్లతో ఇబ్బంది పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను సేవిస్తే గనుక చాలా త్వరగా నరాల బలహీనత నుంచి బయట పడొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నరాల బలహీనతను నివారించే ఆ డ్రింక్ ఏంటీ.
? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు స్పూన్లు పుచ్చకాయ గింజలు, ఐదు స్పూన్ల అవిసె గింజలు, రెండు బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, అర స్పూన్ మిరియాలు, పది వాల్ నట్స్, మూడు చిన్న పటిక బెల్లం ముక్కలు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. """/" /
ఇప్పుడు ఒక గిన్నెలో గ్లాస్ పాలు పోసి మరిగించుకోవాలి.
అనంతరం స్టవ్ ఆఫ్ చేసి కాచిన పాలల్లో ఒక స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసి మిక్స్ చేసి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
పాలు ఇష్టం లేక పోతే గనుక ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కూడా తయారు చేసుకున్న పొడి కలిపి సేవించవచ్చు.
రోజులో ఒకసారి ఇలా ఎలా తీసుకున్నా నరాల బలహీనత పరార్ అవుతుంది.నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది.
అలాగే ఈ అద్భుతమైన పానియాన్ని సేవించడం వల్ల ఎముకలు, దంతాలు దృఢపడతాయి.నీరసం, అలసట దూరం అవుతాయి.
శరీరం యాక్టివ్‌గా మారుతుంది.రక్త హీనత ఉంటే పరార్ అవుతుంది.
మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం లక్కీ భాస్కర్లు ఉన్నారా.. ఇలాంటి మోసాలకు పాల్పడ్డారా?