కంటి చూపు మంద‌గిస్తోందా? అయితే మీరీ జ్యూస్ తాగాల్సిందే!

కంటి చూపు మంద‌గించ‌డం.ఇంత‌కు ముందుకు అర‌వై, డ‌బ్బై ఏళ్లు దాటిన వారిలోనే ఈ స‌మ‌స్య కనిపించేది.

కానీ, ప్ర‌స్తుత‌ రోజుల్లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, జీవ‌న శైలిలో వ‌చ్చే మార్పులు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కంటి చూపు నెమ్మ‌దిస్తూ ఉంటుంది.

అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను తీసుకుంటే కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది.

మ‌రి ఆ జ్యూస్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.

? ఎప్పుడు తాగాలి.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స‌గం పైనాపిల్‌ను తీసుకుని పీల్ తీసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే చిన్న‌ కీర దోసనూ తీసుకుని నీటితో కడిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో క‌ట్ చేసుకున్న పైనాపిల్ ముక్క‌లు, కీర దోస ముక్క‌లు, H3 Class=subheader-styleరెండు స్పూన్లు నిమ్మ ర‌సం/h3p, అర క‌ప్పు కొబ్బ‌రి నీళ్లు వేసుకుని బ్లెండ్ చేసుకుంటే జ్యూస్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ సూప‌ర్ హెల్తీ జ్యూస్‌ను ఉద‌యం లేదా సాయంత్రం తాగితే గ‌నుక‌.కంటి చూపు క్రమంగా పెరుగుతుంది.

అదే స‌మ‌యంలో ఏవైనా కంటి సంబంధిత స‌మ‌స్య‌లు ఉంటే దూరం అవుతాయి. """/" / అంతే కాదు, ఈ జ్యూస్‌ను వారంలో నాలుగైదు సార్లు తాగితే ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.

గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

మ‌రియు చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా ఉంటుంది.

టాలీవుడ్ లో రాబోతున్న త్రీక్వెల్ సినిమాస్ ఇవే..?!