మీ పిల్లల మెద‌డు చురుగ్గా మారాలా? అయితే వారి చేత ఇది తాగించాల్సిందే!

పిల్ల‌ల మెద‌డును చురుగ్గా మార్చే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే.అప్పుడే వారు చ‌దువుల్లో బాగా రాణించి జీవితంలో సెటిల్ అవ్వ‌గ‌లుగుతారు.

వారి భవిష్యత్తు బాగుంటుంది.అందుకార‌ణంగానే చిన్న‌త‌నం నుంచీ పిల్ల‌ల డైట్‌లో పోష‌కాహారం ఉండేలా చూసుకోవాల‌ని త‌ల్లిదండ్రుల‌కు ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తూనే ఉంటారు.

కానీ, కొంద‌రు పిల్ల‌లు ఏం పెట్టినా తిన‌డానికి మారాం చేస్తుంటారు.ఈ లిస్ట్‌లో మీ పిల్ల‌లు ఉన్నారా.

? అయితే అస్స‌లు బాధ‌ప‌డ‌కండి.ఎందుకంటే.

ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను వారి చేత ప్ర‌తి రోజు తాగిస్తే.మెద‌డు అభివృద్ధితో పాటు ఆరోగ్యం సైతం అద్భుతంగా మెరుగుప‌డుతుంది.

మ‌రి లేటెందుకు ఆ సూప‌ర్ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ నువ్వులు, వ‌న్ టేబుల్ స్పూన్ వేరెశెన‌గ‌లు, నాలుగు బాదం ప‌ప్పులు, వ‌న్ టేబుల్ స్పూన్ గుమ్మ‌డి గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ స‌న్ ఫ్లెవ‌ర్ సీడ్స్ వేసుకుని వాట‌ర్ పోసి నైటంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే నాన‌బెట్టుకున్న వాటిని రెండు సార్లు క‌డ‌గాలి.అలాగే బాదం ప‌ప్పుల‌కు ఉన్న తొక్క‌ను సైతం తొల‌గించి.

అన్నిటినీ బ్లెండ‌ర్‌లో వేసుకోవాలి.ఆపై అందులో తొక్క తొల‌గించిన ఒక అర‌టి పండు, ఒక స‌పోటా పండు, ఒక గ్లాస్ పాలు, అర గ్లాస్ వాట‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ సిద్ధం అవుతుంది.

"""/" / ఒక గ్లాస్ చ‌ప్పున దీనిని ప్ర‌తి రోజు పిల్ల‌ల చేత తాగిస్తే.

పిల్లల మెద‌డు చురుగ్గా మారుతుంది.దాంతో వారి జ్ఞాపకశక్తి, ఆలోచ‌నా శ‌క్తి రెండూ పెరుగుతాయి.

వారు చ‌దువుల్లో రాణిస్తారు.తెలివితేట‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు.

అలాగే పైన చెప్పిన డ్రింక్‌ను పిల్ల‌ల చేత తాగించ‌డం వ‌ల్ల‌.వారి ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలెన్నో అందుతాయి.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సైతం బ‌ల‌ప‌డుతుంది.