అదిరిపోయే పోస్టర్ విడుదల చేసిన సన్ రైజర్స్.. బాహుబలి గా వార్నర్!

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బాహుబలి.ఈ సినిమా తో మన తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళి కే సొంతం.

రాజమౌళి, ప్రభాస్ 5 సంవత్సరాలు ఎంతో శ్రమించి అద్భుతంగా తెరెకెక్కించారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల మోత మోగించింది.

బాహుబలి హిట్ తర్వాత ఒక్కసారిగా అందరి చూపు తెలుగు సినీ పరిశ్రమపై పడింది.

ఈ సినిమా హిట్ తో ఇప్పటికే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి ఈ సినిమా క్రేజ్ బాగానే ఉంది.

ఇప్పటికే బాహుబలి క్రేజ్ ను చాలా మంది వాడుకుని అనేక సినిమాల్లో అవకాశాలు పొందారు.

అంతేకాదు ఇంకా చాలా రకాలుగా వాడుకున్నారు.బాహుబలి క్రేజ్ ను ప్రముఖ క్రికెటర్స్ కూడా వాడుకున్నారు.

"""/"/ ఆ లిస్టులో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు.ఈయన లాక్ డౌన్ లో ఒక వీడియో చేసారు.

ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో భారీ స్పందన వచ్చింది.అయితే ఇప్పుడు హైదరాబాద్ ఐ పి ఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా డేవిడ్ వార్నర్ తో చేసిన ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

ఇప్పుడు ఈ పోస్టర్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.సన్ రైజర్స్ హైదరాబాద్ టీం డేవిడ్ వార్నర్ ను బాహుబలి గెటప్ లో చూపిస్తూ అదిరిపోయే పోస్టర్ విడుదల చేసారు.

ఇందులో టీమ్ ట్వీట్ చేస్తూ ఊపిరి పీల్చుకో హైదరాబాద్ మన కెప్టెన్ తిరిగి వచ్చాడు.

అంటూ ట్వీట్ చేసింది.ఈ ఫోటోను అదిరిపోయే ఎడిటింగ్ తో సూపర్ గా ఉంది.

ఈ ఫోటో చుసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను లైక్ చేస్తూ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తొలిసారి అలా కనిపించబోతున్న న్యాచురల్ స్టార్.. ఫ్యాన్స్ కు అలా షాకివ్వడం పక్కా!