అంతగా ఏం సాధించారు.? వెకేషన్ కు చెక్కేసిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు..
TeluguStop.com
ఐపీఎల్ 2025 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad ) జట్టు ఊహించని ఎత్తుపల్లాలతో సాగుతోంది.
టోర్నీని అద్భుతమైన ఆరంభంతో మొదలుపెట్టి, తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఈ జట్టు, ఆత్మవిశ్వాసాన్ని చాటింది.
అయితే ఆ తర్వాత జట్టు వరుస పరాజయాల పాలైంది.ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్ 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది.
అయినప్పటికీ, ఇటీవల సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఓడించి ప్లే ఆఫ్స్‌కు అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.
ప్రస్తుతానికి ఎస్‌ఆర్‌హెచ్ చాలా కీలక దశలో ఉంది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/04/sunrisers-hyderabad-take-a-males-break-mid-ipl-2025-to-recharge-for-crucial-matches-detailss!--jpg" /
ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సన్‌రైజర్స్ టీమ్ అనూహ్యంగా టోర్నమెంట్ మధ్యలో దేశం విడిచేసింది.
అయితే, కంగారు పడాల్సిన పని లేదు.ఆటగాళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు, మైండ్ ఫ్రెష్ చేసుకునేందుకు జట్టు మాల్దీవులకు( Males ) వెకేషన్‌కి వెళ్లింది.
టీమ్ ఓనర్ కావ్య మారన్ నేతృత్వంలో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ సీజన్‌లో మరో ఐదు కీలకమైన మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ ఐదు మ్యాచ్‌లను గెలవడం తప్పనిసరి.మరోవైపు, తర్వాత మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజుల గ్యాప్ ఉండటంతో, ఈ సమయంలో ఆటగాళ్లను కాస్త రిలాక్స్ చేయాలనే ఉద్దేశంతో మాల్దీవుల పర్యటనను ప్లాన్ చేశారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/04/sunrisers-hyderabad-take-a-males-break-mid-ipl-2025-to-recharge-for-crucial-matches-detailsa!--jpg" /
ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల గేమ్ ప్రెషర్, వరుస ప్రయాణాల వల్ల జట్టు మానసికంగా అలసిపోయింది.
అందుకే, మాల్దీవుల్లో చల్లటి వాతావరణంలో కాస్త రిలాక్స్ అయి, మిగిలిన మ్యాచులకు కొత్త ఎనర్జీతో రంగప్రవేశం చేయాలని భావిస్తోంది ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్.
గత ఏడాది కూడా అద్భుతమైన ఫామ్‌తో ఫైనల్ వరకు వెళ్లిన సన్‌రైజర్స్ జట్టు, తక్కువ తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయి ట్రోఫీ చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
ఈసారి తప్పకుండా టైటిల్ చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో జట్టు ముందుకెళ్తోంది.ఇక తెలుగు అభిమానులు కూడా జట్టు విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ మాల్దీవుల విహారం ద్వారా జట్టు కొత్త ఉత్సాహంతో మైదానంలో అడుగుపెడితే, ప్లే ఆఫ్స్‌లో బలమైన పోటీ చూపించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
చూడాలి మరి, ఈ స్ట్రాటజీ ఎస్‌ఆర్‌హెచ్ మళ్లి గాడిలో పెడుతుందా లేదో.