దీన్ని చూస్తే.. నిజంగానే ఇషాన్ కిషన్ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసాడనే అనిపిస్తోంది!
TeluguStop.com
తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad ) ఆడిన ఇన్నింగ్స్ అనేక అనుమానాలకు తావు తీస్తోంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆశించిన ఆరంభం దక్కకపోవడమే కాకుండా, ఆటతీరు చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
మొదటి ఓవర్‌లో కేవలం ఎక్స్‌ట్రాల రూపంలో రెండు పరుగులే వచ్చాయి.రెండో ఓవర్ మొదటి బంతికే ట్రావిస్ హెడ్ ట్రెంట్ బౌల్ట్‌కి ( Travis Head To Trent Boult )క్యాచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆటతీరు చూపించగా, బౌల్ట్ ఆ క్యాచ్‌ని మిస్ చేశాడు.
అయితే వెంటనే తర్వాతి బంతిని స్లోగా ఆడుతూ అందరికీ అర్థమయ్యేలా అవుట్ అయ్యాడు.
4 బంతులు ఆడిన హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ ( Ishan Kishan )తన పూర్వ జట్టుపై ఆడుతున్న భావోద్వేగంతో నిండిపోయినట్టున్నాడు.
దీపక్ చాహార్ బౌలింగ్‌లో బంతి బ్యాట్‌కు తగలకపోయినా, అంపైర్ కూడా అవుట్ ఇవ్వకపోయినా, డీఆర్‌ఎస్ తీసుకోకుండా "నేను అవుట్" అంటూ స్వచ్ఛంధంగా పెవిలియన్‌కి వెళ్లిపోయాడు.
అయితే, టీవీ రిప్లై చూస్తే బంతికి, బ్యాట్‌కు మధ్య స్పష్టమైన గ్యాప్ కనిపించడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు.
ఇది ఫ్యాన్స్‌లో అనుమానాలకు తావిచ్చింది. """/" /
అభిషేక్ శర్మ( Abhishek Sharma ) ఒక సిక్సర్ కొట్టిన తర్వాత 8 పరుగుల వద్ద విఘ్నేష్ పుతూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
నితీశ్ కుమార్ రెడ్డి (2 పరుగులు) కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కి సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దింతో కేవలం 13 పరుగుల వద్దే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఒకవేళ పిచ్ కష్టంగా ఉన్నా ఇలాంటి ఆటతీరు అసాధారణంగా కనిపించింది.ఫీల్డర్ల వైపు చూస్తూ, వారి చేతుల్లోకి నేరుగా బంతులు ఇచ్చే విధానం.
మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలకు బలంగా మారింది. """/" /
ప్రస్తుతం ఇషాన్ కిషన్‌కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవుట్ కాకపోయినా పెవిలియన్‌కు వెళ్లిన విధానం, అంపైర్ సంశయంగా నిలిచిపోయిన తీరు ఈ అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చాయి.
బంతి వెనుకపడ్డప్పుడు వైడ్ ఇవ్వాల్సిన స్థితిలోనూ అంపైర్ స్పందన లేదంటే.“ఇది అంతా ప్లాన్‌గా జరగినదేనా?” అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఇక వీడియోలను చూస్తున్న నెటిజన్లు “ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ కదా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక మచ్ లో ముంబై 7 వికెట్లతో భారీ విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో 3 వ స్థానానికి చేరుకుంది.