పెళ్లి చేసుకుంటానని మోసం.. కాళ్ల కింద భూమి కంపించినట్లైంది.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బాలీవుడ్, టాలీవుడ్( Bollywood, Tollywood ) ఇండస్ట్రీలతో పాటు ఇతర ఇండస్ట్రీలలో సన్నీ లియోన్( Sunny Leone ) కు మంచి గుర్తింపు ఉంది.
తెలుగులో సన్నీ లియోన్ చివరిగా జిన్నా అనే సినిమాలో నటించారు.ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం సన్నీ లియోన్ బుల్లితెరపై ప్రసారమవుతున్న స్ప్లిట్స్ విల్లా ఐదో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ షోలో సన్నీ లియోన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఇది నా పెళ్లికి ముందు జరిగిన సంఘటన అని ఆమె చెప్పుకొచ్చారు.
ఒక వ్యక్తిని ఎంతో ప్రేమించానని నిశ్చితార్థం కూడా చేసుకున్నానని ఆమె పేర్కొన్నారు.కానీ అతడు నేను మోసం చేస్తున్నాడేమో అని మనసు కీడు శంకించిందని సన్నీ లియోన్ వెల్లడించారు.
ఒకసారి తననే నేరుగా అడిగేశానని ఆమె అన్నారు.నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే నీ మీద ప్రేమ ఎప్పుడో పొయిందని ఆ వ్యక్తి చెప్పాడని ఆమె చెప్పుకొచ్చారు.
"""/" /
ఆ సమయంలో కాళ్ల కింద భూమి కంపించినట్లైందని అప్పటికే మా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయిందని సన్నీలియోన్ పేర్కొన్నారు.
హవాయి దీవుల్లో( Hawaiian Islands ) గ్రాండ్ గా పెళ్లి జరుపుకోవాలని భావించానని ఆమె చెప్పుకొచ్చారు.
ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశానని సన్నీలియోన్ వెల్లడించడం గమనార్హం.
పెళ్లికి రెండు నెలలు ఉండగా నేనంటే ఇష్టం లేదని చెప్పి ఆ వ్యక్తి నా గుండె ముక్కలు చేశాడని సన్నీలియోన్ పేర్కొన్నారు.
"""/" /
ఆ సమయంలో నేనెంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసని ఆమె తెలిపారు.
ఆ సమయంలోనే దేవుడు నాకోసం వెబర్ ను పంపాడని ఆమె చెప్పుకొచ్చారు.వెబర్ కష్ట సమయాల్లో అండగా నిలబడ్డాడని అమ్మానాన్న మరణించిన సమయంలో నా వెంట నిలబడి ధైర్యం చెప్పాడని ఆమె చెప్పారు.
సన్నీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఫ్రీ డేటా, ఫ్రీ ఓటీటీ ఇచ్చినా అంబానీకి నో క్రెడిట్.. ఇది కదా కలికాలం అంటే?