‘సన్నీ లియోన్’కి డిగ్రీ చదివే కొడుకు ఉన్నాడని మీకు తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన నటన ద్వారా, తన అందచందాలతో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్నారు.

అటు బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా ఇటు తెలుగు సినిమాలలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు.

ఈ అందమైన భామకు డిగ్రీ చదివే కుమారుడున్నాడని మీకు తెలుసా? ప్రస్తుతం సన్నీలియోన్ కి డిగ్రీ చదివే కుమారుడున్నాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేయడంలో తల్లి పేరు ఉన్న కాలమ్ లో ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరును రాశాడు.

తండ్రి కాలమ్ లో ఇమ్రాన్ హష్మీ పేరును రాశాడు.అయితే ఎగ్జామ్ అప్లికేషన్ లో ఇలా తప్పుడు వివరాలతో నమోదుచేసి హాల్ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే ప్రస్తుతం ఆ విద్యార్థి దరఖాస్తు చేసిన ఫారమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

"""/"/ ఈ అప్లికేషన్ చూసిన నెటిజన్లు సన్నీలియోన్ కి డిగ్రీ చదివే కొడుకు ఉన్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ అధికారుల దృష్టికి రావడంతో వెంటనే విచారణకు ఆదేశించారు.

దీనిపై యూనివర్సిటీ విచారణ చేపట్టగా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న మీనాపూర్లోని ధన్రాజ్ మహతో డిగ్రీ కళాశాలలో బి.

ఎ ద్వితీయ సంవత్సరం చదివే కుర్రాడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

అయితే ఆ విద్యార్థిని ఉద్దేశపూర్వకంగానే ఇలా బాలీవుడ్ నటుల పేర్లతో దరఖాస్తు చేసినట్లు విచారణలో తేలింది.

ఇవి మాత్రమే కాకుండా తన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వివరాలను కూడా అందులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఆ కుర్రాడు మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ద్వారా ఆ విద్యార్థిని గుర్తించే ప్రయత్నం చేస్తోందని తప్పకుండా విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.

అయితే ఆ విద్యార్థి చేసిన తుంటరి పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ట్రిపుల్ రోల్ లో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే !