సన్నీలియోన్ కూతురు ని ఎప్పుడైనా చూసారా….?
TeluguStop.com
ఒకప్పుడు తన శృంగార భరిత తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఆ తర్వాత బాలీవుడ్ మరియు తెలుగు చిత్రాలలో స్పెషల్ పాటలలో నటించి తన గతానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం మంచి నటిగా మరియు తల్లి గా గుర్తింపు తెచ్చుకున్న "సన్నీ లియోన్" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఎవరైనా సరే మన దేశంలో నివసిస్తే మన దేశ ఆచారాలు మరియు కట్టుబాట్లు, సంప్రదాయాల కి ముగ్దులు అవ్వాల్సిందేనని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే ఇటీవలే రాఖీ పౌర్ణమి పండుగ కావడంతో సన్నీ లియోన్ దత్తత తీసుకున్న కూతురు నిషా కౌర్ వెబర్ తో తన సోదరులు ఆశేర్ సింగ్ వెబర్, నోయా సింగ్ వెబర్ లకు రాఖి కట్టించింది.
అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
అయితే వ్యక్తి గతంగా సన్నీలియోన్ కెనడా దేశంలో పుట్టి పెరిగినప్పటికీ గత కొద్ది కాలంగా తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి భారతదేశంలోనే ఉంటోంది.
అలాగే దేశంలో చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు ఒక చారిటీ ను కూడా నడుపుతూ ఉంది.
అయితే గతంలో ఎన్నో మార్లు సన్నీ లియోన్ తన గత జీవితం గురించి బాధపడుతూ తాను ఒకప్పుడు తన కుటుంబ పోషణ నిమిత్తమై అలాంటి చిత్రాలలో నటించినప్పటికీ అందులో నుంచి బయటపడడానికి వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నానని ప్రస్తుతం తన భర్త పిల్లలతో సంతోషంగా జీవితం గడుపుతున్నారని తెలిపింది.
దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులనేవి ఉంటాయని అలాగే మనకి మారడానికి వచ్చే అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు పూలపాన్పు అవుతుందని సన్నీ లియోన్ నిరూపించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ సంచలన వ్యాఖ్యలు… సంతృప్తిగా లేదంటూ?