బిగ్ బాస్ టైటిల్ గెలిచిన సన్నీ..!

బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ వీజే సన్నీ గెలిచాడు.19 మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ సీజన్ లో షణ్ముఖ్, సన్నీ ఫైనలిస్టులు కాగా సన్నీ విన్నర్ గా నిలిచాడు.

విన్నర్ కు ఎనౌన్స్ చేసినట్టుగానే 50 లక్షల క్యాష్ ప్రైజ్.సువర్ణ కుటీర్ లో ఓ ఇంటి ప్లాట్.

టీవీఎస్ అపాచే బైక్ గిఫ్ట్ గా ఇచ్చారు.మొదటి నుండి హౌజ్ లో ఎంటర్టైనర్ గా నిలిచిన సన్నీ ఎలాంటి టాస్క్ అయినా సరే తన 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేవాడు.

తను ఆడిన టాస్క్ లను మ్యాక్సిమం గెలిచిన సన్నీ ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా కూడా నిలిచాడు.

సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5లో రన్నర్ గా నిలిచాడు.

బిగ్ బాస్ టైటిల్ గెలిచిన సన్నీ తనకి ఓటు వేసి గెలిపించిన ఆడియెన్స్ కు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు.

అంతేకాదు తన మదర్ కళావతికి టైటిల్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పిన సన్నీ గెలిచిన టైటిల్ ను తన మదర్ కి ఇచ్చేశాడు.

వీజే గా, సీరియల్ ఆర్టిస్ట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లే ముందు పెద్దగా ఎవరికి తెలియకపోయినా తన ఆట తీరుతో అందరి మనసులు గెలిచాడు సన్నీ.

బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..: డిప్యూటీ సీఎం భట్టి