వైయస్ వివేక హత్య కేసులో సీబీఐకి సునీత రెడ్డి సాయం.. కోర్టు అనుమతి..!!
TeluguStop.com
వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేసులో చోటు చేసుకుంటున్న సంఘటనలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) సీబీఐ విచారణకు హాజరు అవుతూ వస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా దర్యాప్తులో భాగంగా సీబీఐకి సహకరించేందుకు తనకు.తన న్యాయవాదులకు అనుమతి ఇవ్వాలని సునీత రెడ్డి( Sunitha Reddy ) హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం.ఇవ్వాళ అనుమతి మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు అవసరమైన సాయం అందించేందుకు సునీత రెడ్డికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
"""/" /
ఈ పరిణామంతో సీబీఐతో కలసి సునీత అధికారికంగా పనిచేసేందుకు అనుమతి దొరికినట్లు అయింది.
ఇదే సమయంలో హైదరాబాద్ సీబీఐ కోర్టు కండిషన్ కూడా పెట్టడం జరిగింది.గతంలో సుప్రీం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే దర్యాప్తులో సీబీఐకి సునీత రెడ్డి ఆమె న్యాయవాదులు అందించే సాయం ఉండాలని సూచించింది.
సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే భవిష్యత్తులో సునీత రెడ్డికి ఇచ్చిన అనుమతి రద్దు చేసేందుకు సీబీఐ కోర్టుకు అధికారం ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.
కాగా ఈనెల 30 లోపు వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు.
సీబీఐకి గడువు విధించింది.దీంతో దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ వేగవంతంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వంభర సినిమాలో వీణ సాంగ్.. వింటేజ్ చిరంజీవి కచ్చితంగా కనిపించనున్నారా?