లావణ్య త్రిపాఠిని లవర్ అంటున్న శాక్రిఫైజింగ్ స్టార్ అరెస్ట్

ఈ మధ్యకాలంలో శాక్రిఫైజింగ్ స్టార్ గా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయిన సునిశిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో లావణ్య త్రిపాఠి, తను ప్రేమించున్నాం అని పెళ్లి కూడా చేసుకోవడం జరిగిందని ఇతను ప్రచారం చేసుకున్నాడు.

అలాగే ఇతర హీరోయిన్స్ తో కూడా తనకి ఎఫైర్స్ ఉన్నాయంటూ మాట్లాడాడు.అదే సమయంలో స్టార్ హీరోల సినిమాలలో ముందు హీరోగా తననే తీసుకున్నారని, తరువాత తనని తప్పించి వాళ్ళని పెట్టుకున్నారు అంటూ పదే పదే చెబుతున్నాడు.

తనని చాలా సినిమాల నుంచి హీరోగా ఎంపిక చేసి మళ్ళీ తొలగించారని, దానికోసం ఆ హీరోలు తనకి డబ్బులు కూడా ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నాడు.

చాలా యుట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం పదే పదే అతనితో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.

అతను చేస్తున్న హడావిడిని ప్రచారం చేస్తున్నాయి.దీంతో సోషల్ మీడియాలో సునిశిత్ ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబ్ ఛాన‌ల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ హీరోలు, హీరోయిన్ లపైన, పోలీసులపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతూ ప్రచారం చేసుకోవడంతో అతని మీద ప‌లు స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదయ్యాయి.

తాజాగా సునిషిత్ ను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సిఐ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి మీద గ‌తంలో ప‌లు కేసులు న‌మోద‌య్యాయ‌య‌ని అన్నారు.

అత‌ని కుటుంబ‌స‌భ్యుల్ని విచారించ‌గా అత‌ని మాన‌సిక స్థితిబాగుంద‌న్నారు.పేరు కోసం యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడ‌ని, ఫేమ్ కోసం ఇష్ట‌వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్న‌ట్లు త‌మ‌కు ఫిర్యాదులు అందాయ‌ని అన్నారు.

ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు త‌ర‌లించిన‌ట్లు కీస‌ర పోలీసులు తెలిపారు.

డెలివరీ తర్వాత జుట్టు పల్చగా మారిపోయిందా.. అయితే ఈ హెయిర్ రీగ్రోత్ టానిక్ మీకోసమే!