Sunishit: జూనియర్ ఎన్టీఆర్ ను క్షమాపణలు కోరిన సునిశిత్.. ఫ్యాన్స్ అలా చుక్కలు చూపించడంతో?
TeluguStop.com
సునిశిత్.( Sunishit ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలలో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతూ శాక్రిఫైజ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సునిశిత్.
తాను చేయాల్సిన పాత్రలు హీరోలు అడిగితే ఇచ్చేస్తానని, చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేశానని, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఇలా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన విషయం తెలిసిందే.
మొన్నటికి మొన్న రామ్ చరణ్, ఉపాసనలపై పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేయడంతో చెర్రీ ఫ్యాన్స్ మా వదిన గురించి తప్పుగా మాట్లాడతావా అంటూ దేహశుద్ధి చేశారు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దానికి తోడు కొన్ని రకాల యూట్యూబ్ ఛానల్ వారి రేటింగ్ ని పెంచుకోవడానికి ఇంటర్వ్యూలో పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడిగి అతని మరింత రెచ్చగొట్టి మాట్లాడేలా చేస్తున్నారు.
ఆ సమయంలో బాగానే మాట్లాడిన ఆ తర్వాత తన్నులు తింటూ ఉన్నాడు సునిశిత్.
రామ్ చరణ్ అభిమానుల చేతిలో దెబ్బలు తిన్న కూడా ఇతగాడిలో మార్పు రాలేదు.
ఆ తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పై( Jr NTR ) ఘాటు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ తనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని, ఎంత పెద్ద హీరో అయినా అతడు పోర్న్ సినిమాలు చేశాడు.
"""/" /
కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు నాకు మాత్రమే తెలుసు అంటూ నోటికి వచ్చిన విధంగా వాగాడు.
సునిశిత్ మాట్లాడిన మాటలపై ఎన్టీఆర్ అభిమానులు( NTR Fans ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కనిపిస్తే చంపేస్తాం అన్నంతగా కర్రలు పట్టుకుని తిరిగారు.ఇక ప్రాణంతో పరుగులు పెడుతూనే ఉన్నాడు.
ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు భయపడి పోయిన సునిశిత్ ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే. """/" /
నన్ను క్షమించండి ఎన్టీఆర్ గారు.
నన్ను క్షమించండి.ఫ్యాన్స్ నా తప్పును మన్నించి ఇకనుంచి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరుకుంటున్నాను.
నేను ఈరోజు నుంచి ఎన్టీఆర్ కు సపోర్టర్ ను.థాంక్స్ అని చెప్పుకొచ్చాడు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు చుక్కలు చూపించినట్టు ఉన్నారు అందుకే మనోడు దెబ్బకు దిగి వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?