డైరెక్టర్ గా మారబోతున్న సునీల్.. హీరో ఎవరంటే..?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం తరువాత కమెడియన్ గా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్.
ఏ పాత్రలో కామెడీ చేసినా కడుపుబ్బా నవ్విస్తూ సునీల్ ప్రేక్షకుల మెప్పు పొందారు.
కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలోనే సునీల్ కు అందాల రాముడు సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది.
ఆ సినిమా హిట్ ఫలితాన్ని అందుకోగా దర్శకధీరుడు రాజమౌళి మగధీర సినిమా తరువాత సునీల్ తో మర్యాదరామన్న సినిమా తీశారు.
మర్యాదరామన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో సునీల్ కమెడియన్ రోల్స్ కు గుడ్ బై చెప్పి హీరోగా నటించడానికే ఆసక్తి చూపారు.
కానీ ఆ తరువాత సునీల్ హీరోగా నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
వరుస ఫ్లాపుల అనంతరం సునీల్ రెండో ఇన్నింగ్స్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో సైతం సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని సమాచారం.
అయితే సునీల్ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడని దర్శకునిగా మారబోతున్నారని తెలుస్తోంది.ఒక మరాఠీ సినిమాను తెలుగులో సునీల్ రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాలో ఒక యంగ్ హీరో నటిస్తారని.ప్రస్తుతం సునీల్ మరాఠీ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులుచేర్పులు చేస్తున్నట్టు సమాచారం.
సునీల్ ఈ సినిమా దర్శకత్వం వహించడంతో సినిమాలో కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.డైరెక్టర్ గా మారినా సునీల్ సినిమాల్లో నటిస్తూనే ఉంటారని చాలాకాలం డైరెక్టర్ కావాలని ఉన్న కోరికను సునీల్ మరాఠీ రీమేక్ కు దర్శకత్వం వహించి నెరవేర్చుకోనున్నారని సమాచారం.
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!