ఎఫ్3లో ఆ పాత్ర హైలైట్‌గా నిలవనుందట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘ఎఫ్3’ చిత్రం ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎఫ్2కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు మరోసారి తమదైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.

కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోలతో పాటు మరో యాక్టర్ అదిరిపోయే కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలుత ఈ సినిమాలో ఈ పాత్రలో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఈ పాత్రలో కమెడియన్ సునీల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో సునీల్ ఒక పిసినారి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన ‘అహ నా పెళ్లంట’ చిత్రంలో కోటశ్రీనివాసరావు పాత్రను పోలి ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఈ పాత్ర ఎఫ్ 3 సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పిసినారి పాత్రలో సునీల్ చేసే కామెడీ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

కాగా వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు జోడీగా ఎఫ్ 2లో నటించిన తమన్నా, మెహ్రీన్‌లు మరోసారి నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరగనుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది.

ఈ సినిమాతో ఎఫ్2 సక్సెస్‌ను కంటిన్యూ చేసేందుకు అనిల్ రావిపూడి పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి హిట్ కొట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. !