ఎఫ్ 3 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సునీల్
TeluguStop.com
వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన చిత్రం ఎఫ్ 2.
ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అదే హీరోలు హీరోయిన్స్ నటించిన ఎఫ్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అదే దర్శకుడు అనీల్ రావిపూడి అదే నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో చేసిన ఎఫ్ 3 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ నెల చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఎఫ్ 3 సినిమా లో కీలక పాత్రను సునీల్ పోషించిన విషయం తెల్సిందే.
ఎఫ్ 2 సినిమా లో సునీల్ లేడు.ఆ సినిమా లో సునీల్ లేకపోవడం వల్ల లోటు క్లీయర్ గా కనిపించింది.
అందుకే ఇప్పుడు ఈ ఎఫ్ 3 లో సునీల్ ను దర్శకుడు అనీల్ రావిపూడి నటింపజేశాడు.
ఖచ్చితంగా సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా సునీల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు.
ఎఫ్ 3 సినిమా లో నా పాత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
వింటేజ్ సునీల్ ను ఈ సినిమా లో తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు అనే నమ్మకంను సునీల్ వ్యక్తం చేశాడు.
సినిమా లోని ప్రతి సన్నివేశం కూడా ఆకట్టుకునే విధంగా మంచి కామెడీ తో నడుస్తుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ ఫుల్ గా నేను ఉంటాను.
వరుణ్ తేజ్ కు స్నేహితుడిగా నేను సినిమా లో కనిపిస్తాను.ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అలర్ట్, రెస్టారెంట్ బిల్లులు కూడా ఫేక్ చేస్తోన్న AI.. కొత్త టెన్షన్ మొదలైంది!