అమ్మాయిల అందాన్ని పెంచే పొద్దుతిరుగుడు.. ఎలా వాడాలంటే..?

పొద్దుతిరుగుడు గింజలు(సన్ ఫ్లవర్ సీడ్స్) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.పోషకాలకు పొద్దుతిరుగుడు గింజలు( Sunflower Seeds ) పవర్ హౌస్ లాంటివి.

నిత్యం ఈ గింజలను తినడం వల్ల మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పని చేయడానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

అయితే అమ్మాయిల అందాన్ని పెంచే సత్తా కూడా పొద్దు తిరుగుడు గింజలకు ఉంది.

అందుకోసం పొద్దుతిరుగుడు గింజలను చర్మానికి ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు వేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఆ తర్వాత అర కప్పు పాలు( Milk ) చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) వేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

ఉదయం మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పొద్దు తిరుగుడు గింజలను మరియు కుంకుమపువ్వును పాలతో సహా వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి కలిపి ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంత‌రం వాట‌ర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. """/" / వారానికి రెండు సార్లు పొద్దు తిరుగుడు గింజలతో ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే అదిరిపోయే లాభాలు మీ సొంతమవుతాయి.

పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఈ మరియు సెలీనియం మెండుగా ఉంటాయి.ఇవి చర్మ కణాల‌ను( Skin Cells ) రిపేర్ చేయడంలో తోడ్పడతాయి.

అలాగే విటమిన్ ఈ లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.

వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా అడ్డుకుంటాయి.ఏజ్‌ పెరిగినా కూడా చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తాయి.

"""/" / అంతేకాదు పైన చెప్పిన రెమెడీని ఫాలో అవ్వడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.చర్మం కాంతివంతంగా మారుతుంది.

పొద్దుతిరుగుడు గింజ‌లు పిగ్మెంటేషన్‌కు చికిత్స చేస్తాయి.మరోవైపు పాలు, కుంకుమపువ్వు మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ గా ప‌ని చేస్తాయి.

చంద‌నం పొడి సహజమైన మెరుపును అందించ‌డంతో పాటు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

యాక్సిడెంట్ తో గాయాలు… టాలీవుడ్ హీరో పోస్ట్ వైరల్!