కీళ్లనొప్పులా..అయితే మీరు ఈ విత్త‌నాలు తినాల్సిందే!

కీళ్ల నొప్పులుఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.యాబై, అర‌వై ఏళ్లు దాటాక కీళ్ల నొప్పులు రావ‌డం స‌ర్వ సాధార‌ణం.

కానీ, ఇటీవ‌ల కాలంలో చాలా మంది చిన్న వ‌య‌సులోనే కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, థైరాయిడ్‌, ఆహారాపు అల‌వాట్లు, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం, అధిక బ‌రువు, ఎక్కువ సేపు ఒకే చోటు కూర్చోవ‌డం లేదా నిల్చోవ‌డం, మారిన జీవ‌న శైలి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి.

అయితే ఈ స‌మ‌స్య ఉన్న వారు చాలా మంది నొప్పుల‌ను త‌గ్గించుకునేందుకు పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటారు.

కానీ, ఇలా పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌టం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

వాస్త‌వానికి కొన్ని కొన్ని ఆహారాల‌తోనే కీళ్ల నొప్పుల‌కు ఈజీగా చెక్ పెట్ట‌వ‌చ్చు.అలాంటి ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు ఒక‌టి.

వీటినే సన్ ఫ్లవర్ సీడ్స్ అని కూడా అంటారు. """/"/ ఈ విత్త‌నాల్లో ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు పొద్దు తిరుగుడు విత్త‌నాల ద్వారా పొందొచ్చు.

అందుకే ఈ విత్త‌నాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను ప్ర‌తి రోజు త‌గ్గిన మోతాదు స్నాక్స్ తీసుకోవ‌చ్చు.

లేదా ఈ విత్త‌నాల పొడిని పెరుగులో క‌లిపి తీసుకున్నా మంచిదే.ఈ విత్తనాల్లో పుష్క‌లంగా ఉంటే మెగ్నీషియం, మాంగనీస్ ఎముక‌ల‌ను, కండ‌రాల‌ను దృఢంగా మారుస్తాయి.

అలాగే ఈ విత్త‌నాల్లో ఉండే కాపర్ ఎముకల జాయింట్లు బాగా పని చేసేందుకు తోడ్ప‌డుతుంది.

అలాగే కీళ్ల నొప్పుల‌ను కూడా దూరం చేస్తుంది.పైగా పొద్దు తిరుగుడు విత్త‌నాలు డైట్‌లో చేర్చుకుంటే వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.

మ‌రియు గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది.

రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో నటించే స్టార్ నటులు వీళ్లే…