మొటిమ‌ల‌ను ఈజీగా నివారించే సన్‌ఫ్లవర్ ఆయిల్..ఎలాగో తెలుసా?

మొటిమ‌లు.వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు.

యవ్వన ప్రాయంలో ప్రారంభ‌మ‌య్యే ఈ మొటిమ‌లు ప్ర‌తి ఒక్క‌రినీ ఇబ్బంది పెడ‌తాయి.ముఖ్యంగా కొంద‌రిని ఇవి అస్స‌లు వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌వు.

ఎన్ని క్రీములు, సీర‌మ్‌లు, ప్యాకులు వేసుకున్నా.మొటిమ‌లు త‌గ్గ‌కుండా ముప్ప తిప్పలు పెడుతూనే ఉంటాయి.

అయితే ఎటువంటి మొండి మొటిమ‌ల‌నైనా త‌గ్గించ‌డంలో స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఇందులో ఉండే పోష‌క విలువ‌లు చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచి.మొటిమ‌ల‌ను సుల‌భంగా ఫోగొట్టేస్తాయి.

మ‌రి చ‌ర్మానికి స‌ణ్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌ను ఎలా యూజ్ చేయాలో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌, ఒక స్పూన్ న్యాచుర‌ల్ అలోవెర జెల్ మ‌రియు చిటికెడు ప‌సుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌ల‌పై అప్లై చేసి ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజూ చేశారంటే మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు మ‌టుమాయం అవుతాయి.

"""/" / అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌, ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ పెరుగు వేసుకుని బాగా క‌లుపు కోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు పైనే అప్లై చేసుకుని కాస్త డ్రై అయిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా మొటిమ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మొటిమ‌ల‌ను త‌గ్గించ‌డ‌మే కాదు.

ముఖ చ‌ర్మాన్ని స్మూత్ అండ్ సాప్ట్‌గా కూడా స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ మార్చ‌గ‌ల‌దు.

అందుకోసం స‌న్ ఫ్లెవ‌ర్ ఆయివ్‌ను డైరెక్ట్‌గా ముఖానికి అప్లై చేసి.ప‌ది నిమిషాల పాటు స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

అనంత‌రం నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే ముఖంపై మొటిమ‌లు రాకుండా ఉంటాయి.

మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడు స్మూత్‌గా, సాఫ్ట్‌గా మెరిసిపోతుంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ తో జోడీ బాగుంటుందని చెబుతున్న కీర్తి సురేష్.. తారక్ ఛాన్స్ ఇస్తారా?