పాత చింతకాయ పచ్చడిని కొత్తగా పట్టుకొస్తున్న హీరో

పాత చింతకాయ పచ్చడిని కొత్తగా పట్టుకొస్తున్న హీరో

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు.గతంలో కొన్ని ఆకట్టుకునే సినిమాలు చేసినా, స్టోరీ సెలెక్షన్‌లో సరైన ఎంపిక లేకపోవడంతో మనోడు చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.

పాత చింతకాయ పచ్చడిని కొత్తగా పట్టుకొస్తున్న హీరో

అయితే గతకొన్ని సినిమాలను చాలా ఆచితూచి ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు.కాగా యంగ్ హీరో నటించిన ఓ సినిమాను తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫాంలపై రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

పాత చింతకాయ పచ్చడిని కొత్తగా పట్టుకొస్తున్న హీరో

సందీప్ తాజాగా ఎలాంటి సినిమా చేశాడు, దాన్ని ఈ లాక్‌డౌన్ సమయంలో ఎందుకు ఓటీటీపై రిలీజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా.

అసలు విషయమేమిటంటే.సందీప్ కిషన్ 2013లో నటించిన డీకే బోస్ అనే సినిమా షూటింగ్‌తో పాటు అన్ని పనులు ముగించుకుని రిలీజ్ సమయంలో వాయిదా పడి అసలు పత్తా లేకుండా పోయింది.

జనాలు కూడా డీకే బోస్ చిత్రం గురించి పూర్తిగా మరిచిపోయారు.అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి.

దీంతో ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసే అవకాశం ఎటూ లేదని, చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇలా చేస్తేనైనా ఈ సినిమాను ప్రేక్షకులు ఎక్కువ మొత్తంలో వీక్షిస్తారని వారు భావిస్తున్నారు.

మరి 2013లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను 2020 ఆడియెన్స్ ఎంతవరకు ఆదరిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు.

కానీ సందీప్ కిషన్‌కు ఉన్న క్రేజ్‌ను డిజిటల్ ప్లాట్‌ఫాంలతో క్యాష్ చేసుకోవాలని డీకే బోస్ చిత్ర నిర్మాతలు చూస్తున్నారు.

మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.ఇక ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్ అనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో నటిస్తున్నాడు ఈ హీరో.

ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు .. సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు