ఈ హీరోయిన్ లిప్ కిస్ లేకుండా సినిమా చెయ్యడం కష్టమే బాబోయ్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె మొదట నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంశ కౌశిక్ ఆ సినిమాలో నాగచైతన్య తో కలిసి బాగానే రొమాన్స్ చేసింది.

అంతే కాకుండా నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్ ల లిప్‌లాక్ సీన్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది.

ఇది ఇలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో కనిపించింది దివ్యాంశ కౌశిక్.

ఇకపోతే దివ్యాంశ కౌశిక్ నటించిన తెలుగు సినిమా మైఖేల్ త్వరలోనే విడుదల కానుంది.

ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ హీరోగా నటించారు.ఈ సినిమాలోనూ హీరో సందీప్ కిషన్‌తో లిప్‌లాక్ లాగింది ఈ బ్యూటీ.

సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం గా మైఖేల్ సినిమా తెరకెక్కబోతోంది.

రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కునుంది.ఇటీవల సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు మేకర్స్.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/10/sundeep-kishan-liplock-with-yansha-kaushik-michael-teaser-on-20th-october-detailsa!--jpg "/ ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాతలు ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు.

మైఖేల్ టీజర్ అక్టోబర్ 20న విడుదల కానుంది.ఈ టీజర్ అనౌన్స్‌మెంట్ డేట్‌తో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

అందులో సందీప్, దివ్యాంశ కౌశిక్ పెదవుల పై ముద్దు పెట్టుకోవడం.బ్యాక్ గ్రౌండ్‌లో ఎగిరే పక్షులతో పోస్టర్ డిజైన్ రొమాంటిక్‌గా ఉంది.

సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని ఈ పోస్టర్ ని బట్టి అర్థం అవుతోంది.

ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమా విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.