ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రీ-రివ్యూ.. సందీప్ కిషన్ గోల్ కొట్టేలా ఉన్నాడే!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్‌ప్రెస్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వాలని సందీప్ కిషన్ చూస్తు్న్నాడు.

ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు హీరో సందీప్ కిషన్.కానీ అతడు పెట్టుకున్న నమ్మకాలు ఈ సినిమాతో ఎంతవరకు నెరవేరుతాయనేది ప్రేక్షకుల్లో పెద్ద ప్రశ్నగా మిగిలింది.

కానీ ఈ సినిమాతో సందీప్ ఖచ్చితంగా హిట్ కొడతాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.

అందుకు కారణం ఈ సినిమా కథే అని వారు చెబుతున్నారు.తమిళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘నట్పె తునై’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తమిళనాట ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.ఈ సినిమా కథ ఓ హాకీ ఆటకు సంబంధించిన ప్లేగ్రౌండ్ చుట్టూ ఉండటం, దాన్ని కాపాడుకునేందుకు ఓ కోచ్ చేసే ప్రయత్నం, ఆయనకు తోడుగా ఓ నిషేధింపబడ్డ ఆటగాడు నిలవడంతో ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంటుంది.

కాగా ఏ1 ఎక్స్‌ప్రెస్ కథ కూడా ఇదే అనే విషయం మనకు చిత్ర టీజర్, ట్రైలర్లు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

మరి ఈ సినిమాలో సందీప్ కిషన్ ఎందుకు బ్యాన్ చేయబడ్డాడు, అతడు తిరిగి హాకీ స్టిక్ పడతాడా లేడా, లావణ్య త్రిపాఠీకి ఈ సినిమాలో ఎలాంటి పాత్ర దక్కింది అనే అంశాలు తెలియాలంటే మాత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రామ్ పోతినేని గెస్ట్‌గా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం తెలుగుస్టాప్.కామ్‌ను తప్పక ఫాలో అవ్వండి.

వైరల్ వీడియో: పెళ్లయితున్న ఆనందంలో రెచ్చిపోయిన పెళ్లి కుమారుడు..