వడదెబ్బ లక్షణాలు ఏంటి.. వడదెబ్బకు గురైతే వెంటనే ఏం చేయాలి?

వేసవి కాలం కొనసాగుతోంది.రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి.

ప్రతి ఏడాది వేసవిలో వడదెబ్బ( Sun Stroke ) కారణంగా ఎంతో మంది క‌న్నుమూస్తున్నారు.

వడదెబ్బ‌ చిన్న సమస్య గానే కనిపించిన అత్యంత ప్రమాదకరమైనది.అసలు వడదెబ్బ లక్షణాలు ఏంటి.

వడ దెబ్బకు గురైతే వెంటనే ఏం చేయాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవికాలంలో వడదెబ్బ అనేది సర్వసాధారణం.ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, వడగాల్పులు బాగా వీచినప్పుడు వడదెబ్బకు గురవుతుంటారు.

"""/" / అయితే వడదెబ్బ బారిన పడినప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుంది.

కళ్ళు తిరుగుతాయి.కండరాలు బలహీనంగా మారిపోతాయి.

అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కష్టంగా మారుతుంది.నాడి వేగంగా కొట్టుకుంటుంది.

నాలుక తడారిపోయి ఎండిపోతుంది.గుండెపోటు( Heart Attack ) పెరుగుతుంది.

స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. """/" / ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి వడదెబ్బకు గురయ్యాడని గుర్తించాలి.

వెంటనే ఆ వ్యక్తిని నీడలో ఉంచి శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన క్లాత్ తో తుడవాలి.

అలాగే వడ దెబ్బకు గురైన వ్యక్తికి కొబ్బరి నీళ్లు( Coconut Water ), గ్లూకోజ్‌, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి ఇవ్వాలి.

ఇది ప్రథమ చికిత్స.ప్రథ‌మ చికిత్స పూర్తయిన వెంటనే వడ దెబ్బకు గురైన వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించాలి.

అక్కడ వైద్యులు సరైన చికిత్స అందిస్తారు. """/" / ఇక వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకండి.ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలపై టోపీ, గొడుగు, ఒక వాటర్ బాటిల్ ను మీ వెంట తీసుకువెళ్లండి.

ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకునేందుకు ప్రయత్నించండి.ధూమపానం, మద్య పానం అలవాట్లకు దూరంగా ఉండండి.

బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌ గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.

మెగాస్టార్ పీఠాన్ని కైవసం చేసుకునే ఆ స్టార్ హీరో ఎవరు..?