కపటదారిని పూర్తి చేసిన అక్కినేని హీరో సుమంత్

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు సుమంత్.

అంతు ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది.అయితే నటుడుగా ఒకే అనిపించుకున్న సుమంత్ కమర్షియల్ హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.

ఎక్కువగా సోలో హీరోగానే సినిమాలు చేసిన సుమంత్ కెరియర్ పరంగా చూసుకుంటే ఎక్కువ లవ్ స్టొరీ చిత్రాలు కనిపిస్తాయి.

అలాగే హిట్స్ కూడా భాగానే ఉన్నాయి.అయితే ఎందుకనో అతనికి స్టార్ హీరోల రేంజ్ లో ఇమేజ్ రాలేదు.

అతను చివరిగా ఇదం జగత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ మధ్య కాలంలో కాస్తా జోనర్ మార్చి థ్రిల్లర్ కథలతో సినిమాలు చేస్తున్న సుమాంత్ ప్రస్తుతం కపటదారి అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.కన్నడలో వచ్చిన కావలదారి చిత్రానికి ఇది రీమేక్.

సుమంత్ తాజాగా ఈ సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు.లాక్ డౌన్ కి ముందే షూటింగ్ తమ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ పేర్కొన్నాడు.త్వరలో రిలీజ్ కి రంగం సిద్ధం అవుతున్న ఈ సినిమాతో సుమంత్ మళ్ళీ బ్యాక్ టూ హిట్ లోకి వస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఎవరు..?