సుమంత్ బర్త్ డే స్పెషల్ : మంచి కిక్కిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ కొత్త పోస్టర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి( Akkineni Family ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.

ఇక వాళ్ళు చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

నాగేశ్వరరావు మనువడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ సైతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.

తన ఎంటైర్ కెరియర్ లో చాలా మంచి సినిమాలను తీసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సుమంత్ ప్రస్తుతం 'మహేంద్రగిరి వారాహి' ( Mahendragiri Varahi )అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈరోజు తన బర్త్ డే అయినందువల్ల మహేంద్రగిరి వారాహి సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు.

ఇక ఈ పోస్టర్ లో సుమంత్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

"""/" / నిప్పు మిణుగురులు చిందుతున్నప్పటికి చాలా ధైర్యం గా ఒక యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక 'సంతోష్ జాగర్లపూడి'( Santosh Jagarlapudi ) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందంటూ సుమంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఇక ఈ సంవత్సరం రాబోతున్న ఈ సినిమాతో సుమంత్ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకొని మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటబోతున్నాడు అనేది మాత్రం వాస్తవం.

ఇక కృష్ణవంశీ దర్శకత్వం లో వచ్చిన 'రంగ మార్తండా' సినిమాతో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా గుర్తింపును సంపాదించుకున్న 'మధు కలిపు' నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం.

"""/" / 'రాజా శ్యామల ఎంటర్ టైన్ మెంట్స్' బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

వారాహి అమ్మ వారి గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అంటూ దర్శకుడు ఇంతకుముందు చాలా సార్లు క్లారిటీ అయితే ఇచ్చాడు.

ఇక ఇప్పటికే సుమంత్-సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్ లో 'సుబ్రహ్మణ్య పురం ' అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా విజయం సాధించడంతో పాటుగా అటు దర్శకుడికి ఇటు సుమంత్ కి చాలా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది.

మరి అదే కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి వీళ్ళ కెరియర్ కి చాలా మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుందాం.