సినిమా అంటే ఏంటో.. నాకు అప్పుడు అర్థమైంది అంటున్న అక్కినేని హీరో సుమంత్?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వారసుడిగా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్.తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు.

మొదట్లో సుమంత్ సినిమాలు పెద్దగా ఆడకపోయినా.ఆ తర్వాత మాత్రం మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

దీంతో ఇక సుమంత్ స్టార్ హీరో అవుతాడు అనుకుంటున్న సమయంలో వరుసగా ఫ్లాపులు రావడంతో సుమంత్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది.

అప్పుడు పడిపోయిన కెరీర్ను పైకి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ అక్కినేని వారసుడు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ సినిమాల గురించి సినిమా వాళ్లు పడే కష్టం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సుమంత్ హీరోగా నటించిన మొదటి సినిమా ప్రేమ కథకు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.

అయితే ఈ సినిమా గురించి చెబుతూ ఎప్పుడు రాంగోపాల్ వర్మను రాము అని పిలుస్తూ ఉంటానని.

అయితే తన మొదటి సినిమాకి ముందు నుంచే రామ్ గోపాల్ వర్మ నాకు మంచి మిత్రుడు అంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు.

అందుకే ఒక ఫ్రెండ్ తో సినిమా తీసినట్లు అనిపించింది అంటూ సుమంత్ తెలిపాడు.

"""/" / స్క్రిప్టు వినేటప్పుడు సినిమా ఎలా ఉంటుందో అర్థం కాలేదని కానీ కొన్నాళ్లు గడిచాక సినిమా పరిస్థితి ఏంటి అన్నది అర్థమైంది అంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల్లో రీషూట్ ల గురించి చెబుతూ.కొన్నిసార్లు సినిమాలు రిషూట్ లు సినిమాకు ప్లస్ పాయింట్ గా మారితే మరి కొన్నిసార్లు మాత్రం రీషూట్ ల కారణంగా నాచురలిటీ దెబ్బతింటుందని తెలిపాడు.

ఇక తాను నటించిన సత్యం సినిమా విడుదలకు వారం రోజుల ముందు మామయ్య నాగార్జున సలహామేరకు కొన్ని సీన్స్ రీషూట్ చేస్తే.

అది ఆ సినిమా విజయానికి ఎంతో కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు.ఇక ఆ తర్వాత భాయ్ సినిమా సమయంలో కూడా ఇలాంటివి రీషూట్స్ చేస్తే అది సినిమాకు దెబ్బ పడింది అంటూ సుమంత్ ఇటీవలే తన సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. అతడి వేలిముద్రలు ఎక్కడా దొరకలేదా?