ఇటీవల కాలంలో ఎంతోమంది కొత్త సెలబ్రిటీలు తమ టాలెంట్ నిరూపించుకోవడం కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
అలాగే కొత్తవారిని ఎంకరేజ్ చేయడం కోసం ఎంతోమంది నిర్మాతలుగా మారి వారిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఇలా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు డ్రీమ్ గేట్స్ బ్యానర్‌ను ప్రారంభించాడు నిర్మాత రాచాల యుగంధర్.
ఈ క్రమంలో సుమన్ తేజ్, ( Suman Tej ) గరిమ చౌహాన్( Garima Chauhan ) అనే కొత్త హీరో హీరోయిన్లతో సీతా కళ్యాణ వైభోగమే( Seetha Kalyana Vaibhogame ) అనే సినిమాను నిర్మించాడు.
ఈ చిత్రానికి సతీష్ పరమవేద దర్శకత్వం వహించాడు.అద్భుతమైన కుటుంబ కథ చిత్రం గా ఓ సందేశాత్మక సినిమాగా నేడు జూన్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.
"""/" /
H3 Class=subheader-styleకథ:/h3p
ఓ గ్రామంలో రామ్ (సుమన్ తేజ్), సీత (గరిమ చౌహాన్)లు నివసిస్తూ ఉంటారు.
అయితే వీరిద్దరూ ప్రేమలో పడి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్లి అక్కడ వారు ఎంతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటారు.
అయితే రామ్ తండ్రి మూర్తి (శివాజీ రాజా)( Shivaji Raja ) చావు అంచులకు వెళ్తుంటాడు.
క్యాన్సర్‌తో బాధపడుతున్న మూర్తి చివరి కోరికగా.తన కోడలిని తన తండ్రి జానకి రామయ్య (నాగినీడు)తో కలిసేలా చేయమని, ఆ కుటుంబంతో సీతను కలపమని కోరతాడు.
ఇక తాను మరణించిన తర్వాత ఎంతో గౌరవంగా బతికిన ఈ ఊర్లోనే తన అంత్యక్రియలు జరగాలని తన అంతిమయాత్ర కూడా ఘనంగా జరగాలని కోరుతాడు.
ఇలా తండ్రి చివరి కోరికను నెరవేర్చడం కోసం రామ్ సీత ఇద్దరు సొంత ఊరికి వస్తారు.
ఆ సమయంలోనే సీత కోసం ఎదురుచూస్తున్న పరమ దుర్మార్గుడు రమణ (గగన్ విహారి) ( Gagan Vihari ) ఏం చేస్తాడు? సీతను, రామ్‌ను ఎలా ఇబ్బంది పెడతాడు? అసలు ఆ ఊరి గుడి ఎందుకు మూసి ఉంటుంది? శ్రీరామనవమికి ఊర్లో ఉండే కట్టుబాట్లు ఏంటి? జానకి రామయ్య తన కూతురి ప్రేమను అర్థం చేసుకుంటాడా? చివరకు రామ్ ఏం చేస్తాడు? రమణ ఆగడాలను ఎలా అంతం చేస్తాడు? అన్నదే కథ.
"""/" /
H3 Class=subheader-styleనటీనటులు./h3p
సినిమా ఇండస్ట్రీకి కొత్తవారు అయినప్పటికీ హీరో హీరోయిన్లు సుమన్ తేజ్, గరిమ చౌహాన్‌ల జంట అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక వీరిద్దరి మధ్య రొమాంటిక్ ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.ఇక విలన్ గా రమణ పాత్రలో గగన్ విహారి ఎంతో అద్భుతంగా నటించారు.
నాగినీడు రెగ్యులర్ తండ్రి పాతలా అనిపిస్తుంది.ఇలా ఎవరి పాత్రలకు అనుగుణంగా వారందరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
"""/" /
H3 Class=subheader-styleవిశ్లేషణ./h3p
రామాయణం, రాముడు సీత విలువలు చెప్పేందుకు, మరిచిపోతోన్న మన సంస్కృతిని చెప్పేందుకే ఈ సినిమాను తీస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రమోషన్స్‌లో చెప్పారు.
అయితే ఈ సినిమాని చూస్తే వారు చెప్పింది నిజమేనని ప్రస్తుతం మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనే విషయాలన్నింటినీ కూడా అద్భుతంగా చూపించారు.
ఇప్పటికే ఎన్నో యుగాలు మారినా ఎంతోమంది శ్రీరాముడిని పూజిస్తూ ఉన్నారు.అలా ఎందుకు పూజించాలి అనే విషయాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఇక సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం వంటి విషయాలను చూపించారు.
ఇక పల్లెటూరు వాతావరణం కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు.మొత్తానికి ఈ చిత్రం ఎంతో ఆహ్లాదకరంగాను ఒక సందేశాత్మక సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్: /h3pనటీనటుల నటన, ఎమోషనల్ సన్నివేశాలు, రామాయణ గొప్పతనం.h3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p అక్కడక్కడ రొటీన్ సన్నివేశాలు చూసాం అనే భావన కలగడం.
H3 Class=subheader-styleరేటింగ్ : 3/5/h3p.
సినిమాలు చేయటం కంటే ఐఏఎస్ అవ్వడమే ఈజీ… సందీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!