మరోసారి తెరమీదకి వచ్చిన సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా… ఎప్పుడు స్టార్ట్ అవుతుంది…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్.
ప్రస్తుతం ఆయన పుష్ప 2(
Pushpa 2 ) సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి తను ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి ఇలాంటి సందర్భంలోనే సుకుమార్ లాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
అయితే ఈ సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ సుకుమార్ అప్పట్లో విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda)కి వరుసగా ఫ్లాప్ లు రావడంతో ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయింది.
ఇక దాంతో సుకుమార్ విజయ్ తో సినిమా చేసే అవకాశాలు లేవు అంటూ చాలామంది సినిమా విమర్శకులు సైతం ఆయన మీద కామెంట్లైతే చేస్తున్నారు.
ఇక సుకుమార్ ( Sukumar)కూడా ఈ విషయం మీద తన స్పందన తెలియజేయడం లేదు.
"""/" /
కాబట్టి ఈ సినిమా ఉండబోదు అని చాలా మంది సినీ మేధావులు సైతం బల్ల గుద్ది చెబుతున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా మీద చర్చ అయితే జరుగుతుంది.ఇక విజయ్ దేవరకొండ ఇప్పుడు వస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలతో భారీ సక్సెస్ లను కనుక సాధించినట్లైతే సుకుమార్ విజయ్ కాంబినేషన్ లో సినిమా తప్పకుండా ఉంటుందంటూ మరి కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం.
ఇక ఏది ఏమైన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకున్న సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతున్న విజయ్ తో సినిమా చేయడం అంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పనే అని కొంతమంది విమర్శకులు సైతం తెలియజేస్తున్నారు.