మూడు గంటల సినిమా చూపిస్తున్న సుకుమార్..!

సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా పుష్ప.

ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తుంది.పుష్ప పార్ట్ 1 ది రైజ్ సినిమా 2 గంటల 56 నిమిషాల దాకా వచ్చినట్టు తెలుస్తుంది.

సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించాడని తెలుస్తుంది.సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ అదరగొట్టేస్తాడని తెలుస్తుంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత కూడా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.

ఇక సుకుమార్ 3 గంటల సినిమా అయినా సరే తన కంటెంట్ మీద బాగా నమ్మకంగా ఉన్నట్టు అర్ధమవుతుంది.

సినిమా సాంగ్స్, ప్రమోషన్స్ అన్ని సినిమాపై సూపర్ బజ్ ఏర్పరిచాయి.తప్పకుండా ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.

 ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వీరిద్దరి కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025